ETV Bharat / sports

'ట్రైనింగ్​ ఇస్తే ఇప్పుడూ క్రికెట్​ ఆడేస్తా' - latest ganguly news

మూడు నెలల శిక్షణ ఇస్తే మళ్లీ టెస్టుల్లో అదరగొడతానని భారత మాజీ కెప్టెన్​ సౌరభ్​ గంగూలీ అన్నారు. ఒకవేళ అవకాశం ఇవ్వకపోయినా సరే, తనలోని నమ్మకాన్ని పోగొట్టలేరని పేర్కొన్నాడు.

Give me three months and three Ranji games, I'll score runs for India in Tests Sourav Ganguly
గంగూలీ
author img

By

Published : Jul 17, 2020, 1:30 PM IST

Updated : Jul 17, 2020, 3:54 PM IST

మూడు నెలలు శిక్షణ ఇస్తే ఇప్పుడూ టెస్టు క్రికెట్ ఆడేస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అంటున్నాడు. కెరీర్ చివరి దశలో తన బ్యాటింగ్​ గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాదా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గంగూలీ 12 ఏళ్ల క్రితం 2008లో చివరగా భారత్​ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2011లో చివరి సారి ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​లో కనిపించాడు.

"వన్డేల్లో నాకు మరో రెండు సిరీస్​ల్లో అవకాశం ఇచ్చినట్లయితే, ఎక్కువ పరుగులు చేసుండేవాడిని. నాగ్​పుర్​లో రిటైర్మెంట్​ తీసుకోకపోయుంటే.. తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ పరుగులు చేసేవాడిని. అంతెందుకు ఇప్పుడు నాకు ఆరునెలల శిక్షణ ఇచ్చి, మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్​ల్లో ఆడనివ్వండి. కచ్చితంగా టెస్టు క్రికెట్​లో భారత్​ తరఫున పరుగులు సాధిస్తా. ఆరు అవసరం లేదు మూడు నెలలు ఇవ్వండి చాలు. మీరు అవకాశం ఇవ్వకపోవచ్చు కానీ నాలోని నమ్మకాన్ని మాత్రం పోగట్టలేరు."

-సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

2007-08 సీజన్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బ్యాట్స్​మెన్​లో తాను ఉన్నప్పటికీ.. వన్డే జట్టు నుంచి తప్పించారని గంగూలీ వెల్లడించాడు. ఆ తర్వాతి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన దాదా.. 2012 వరకు దేశీయ క్రికెట్​, ఐపీఎల్​లో కెరీర్​ కొనసాగించాడు.

మొత్తంగా భారత్ తరఫున గంగూలీ.. 113 టెస్టుల్లో 7,212 పరుగులు చేశాడు. అందులో 16 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 311 మ్యాచ్​లు ఆడి 11,363 పరుగులు సాధించాడు.

ఇదీ చూడండి:ఆర్చర్​ వల్ల ఇంగ్లాండ్ బోర్డుకు లక్షల పౌండ్లు నష్టం!

Last Updated : Jul 17, 2020, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.