ETV Bharat / sports

గిల్​.. ఓ లెజెండరీ క్రికెటర్​గా ఎదుగుతాడు: హాగ్​

భారత జట్టు యువ బ్యాట్స్​మన్ శుభ్​మన్​ గిల్​పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ బ్రాడ్​ హాగ్​ ప్రశంసలు కురిపించాడు. రానున్న పదేళ్లలో.. టెస్టు క్రికెట్​లో ఉత్తమ ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​గా గిల్ ఎదుగుతాడని ఆయన అభిప్రాయపడ్డాడు.

Gill is going to be a bit of a legend: Hogg
గిల్​.. ఓ లెజెండ్​ క్రికెటర్​గా ఎదుగుతాడు: హాగ్​
author img

By

Published : Feb 2, 2021, 12:59 PM IST

Updated : Feb 2, 2021, 2:25 PM IST

టీమ్ఇండియా యువ బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​.. తనకు చిన్నపాటి లెజెండ్​లా కనిపిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ బ్రాడ్​ హాగ్​ అన్నాడు. టెస్టు క్రికెట్​ ప్రపంచంలో రానున్న పదేళ్లలో గిల్​ ఉత్తమ ఓపెనర్​గా ఎదగనున్నాడని జోస్యం చెప్పాడు.

"ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో శుభ్​మన్​ గిల్ బ్యాటింగ్​ తీరు నన్ను ఆకట్టుకుంది. ఆసీస్​ బౌలర్లు షార్ట్​ బంతులు విసిరినా.. అతడు హుక్​ షాట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడొక చిన్నపాటి లెజెండ్​లా కనిపిస్తున్నాడు. రానున్న పదేళ్లలో టెస్టు క్రికెట్ ప్రపంచంలో గిల్​ ఓ ఉత్తమ ఓపెనర్​గా ఎదుగుతాడు".

- బ్రాడ్​ హాగ్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

గతేడాది డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్​లోకి శుభ్​మన్​ గిల్​ అడుగుపెట్టాడు. ఈ సిరీస్​లో కంగారూ జట్టుపై 2-1 తేడాతో టీమ్​ఇండియా సిరీస్​ను కైవసం చేసుకుంది. ఆడిన ఆరు ఇన్నింగ్స్​ 259 పరుగులను రాబట్టాడు. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్​తో 91 రన్స్​ చేసి.. సెంచరీని సాధించకుండానే వెనుదిరిగాడు.

ఇదీ చూడండి: 'పంత్.. ప్రత్యర్థికి గుండెపోటు తెప్పించగలడు'

Last Updated : Feb 2, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.