తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని కోరాడు పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ. దుబాయిలో ఈ నెల 20న షమియాను వివాహం చేసుకోనున్నట్లు శుక్రవారం స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆమె ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ ఇంజనీర్‌గా పనిచేస్తోందని, దిల్లీలో షమియా తల్లిదండ్రులు ఉంటున్నారని వెల్లడించాడు.
"మా రెండు కుటుంబాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని అనుకున్నాయి. కానీ మీడియా ద్వారా సమాచారం బయటకొచ్చింది. అందుకే దీనిపై వస్తున్న ఊహాగానాలను తెరదించాలనే అసలు విషయం చెప్పాను. ఆగస్టు 20న మా నిఖా జరగుతుంది." -హసన్ అలీ, పాక్ క్రికెటర్.
ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన షమియా... ఇంగ్లాండ్‌లోనూ విధ్యనభ్యసించింది. ఏడాది క్రితం ఆమెను కలిశానని, అప్పుడు స్నేహంతో మొదలైన తమ ప్రయాణం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని చెప్పాడు హసన్.
"మా ఇద్దరిలో ప్రేమను మొదటగా వ్యక్తపరిచింది నేనే. ఆ తర్వాత ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. పెళ్లిలో నేను షేర్వాణి వేసుకుంటా, ఆమె భారతీయ సంప్రదాయ దుస్తులు ధరిస్తుంది" -హసన్ అలీ, పాక్ క్రికెటర్.
భారత మహిళను పెళ్లి చేసుకున్న తొలి పాకిస్థానీ క్రికెటర్ జహీర్ అబ్బాస్. ఆ తర్వాత మోసిన్ ఖాన్, షోయాబ్ మాలిక్ ఇదే విధంగా వివాహం చేసుకున్నారు. ఈ జాబితాలో హసన్ అలీ నాలుగో వాడు.
ఇది చదవండి: భారత్ అమ్మాయితో పాక్ క్రికెటర్ పెళ్లి..!