2019... టీమిండియాకు మరిచిపోని ఏడాదిగా మిగిలిపోనుందని భారత పురుషుల క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఇదే జోష్‌తో 2020లో మరిన్ని విజయాలను సాధించాలని ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
-
Happy New Year! Guys, you have had an outstanding year in 2019 and now get ready to attack the fresh challenges ahead. Enjoy the rest. See you with 2020 vision 🇮🇳🙏 pic.twitter.com/lwNGj0bj6O
— Ravi Shastri (@RaviShastriOfc) December 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy New Year! Guys, you have had an outstanding year in 2019 and now get ready to attack the fresh challenges ahead. Enjoy the rest. See you with 2020 vision 🇮🇳🙏 pic.twitter.com/lwNGj0bj6O
— Ravi Shastri (@RaviShastriOfc) December 31, 2019Happy New Year! Guys, you have had an outstanding year in 2019 and now get ready to attack the fresh challenges ahead. Enjoy the rest. See you with 2020 vision 🇮🇳🙏 pic.twitter.com/lwNGj0bj6O
— Ravi Shastri (@RaviShastriOfc) December 31, 2019
"టీమిండియా క్రికెటర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జట్టు విజయాల్లో 2019.. మంచి అనుభూతిని అందిచింది. ఇదే ఉత్సాహంతో 2020లో కొత్త ఛాలెంజ్‌లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండండి"
-రవిశాస్త్రి, టీమిండియా హెడ్ కోచ్
ఈ ఏడాది.. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్.. సెమీస్‌లో నిష్క్రమించింది. లీగ్ దశలో వరుసగా 7 విజయాలను సొంతం చేసుకున్నా.. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ ఒక్క అసంతృప్తి మినహా మిగిలిన అన్ని సిరీస్‌ల్లో టీమిండియా సత్తా చాటింది.
కొత్త సంవత్సరం.. కొత్త ఛాలెంజ్‌లతో
2020 జనవరి 5న శ్రీలంకతో టీమిండియా.. మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇది పూర్తవగానే జనవరి 14 నుంచి ఆస్ట్రేలియాతో, జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి.
ఇదీ చదవండి:- థాయ్‌లాండ్ బీచ్‌లో రాహుల్-అతియా షికార్లు