ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌కు ఆడుతున్న క్రిస్‌గేల్.. శుక్రవారం ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో ఆ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై గేల్ సాధించిన పరుగులు 1,632. శ్రీలంక క్రికెటర్ సంగక్కర 1,625 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఈ ఘనత అందుకోవడానికి గేల్ 34 ఇన్నింగ్స్ ఆడితే, సంగక్కర 41 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఈ జాబితాలో వివ్ రిచర్డ్స్(1619), పాంటింగ్(1598), జయవర్థనే(1562)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి 212 పరుగులకే ఆలౌటైంది విండీస్ జట్టు. నికోలస్ పూరన్ ఒక్కడే 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ఇది చదవండి: 'ఆటగాళ్లూ... వారితో ఎక్కువ సమయం గడపండి' అంటున్న న్యూజిలాండ్ కోచ్