ETV Bharat / sports

వచ్చే ఐపీఎల్​లో ప్రతి మ్యాచ్​లోనూ గేల్!

author img

By

Published : Nov 20, 2020, 2:07 PM IST

Updated : Nov 20, 2020, 4:54 PM IST

ఈసారి ఐపీఎల్​లో పంజాబ్​ జట్టు బాగా ఆడిందని చెప్పారు యజమాని నెస్ వాడియా. కొన్ని మ్యాచ్​లే ఆడినా సరే గేల్​ తన ప్రదర్శనతో మెప్పించాడని తెలిపారు.

Gayle has demonstrated that he should play every game next season: Ness Wadia
గేల్

ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​కు నైపుణ్యం గల క్రికెటర్లు దొరికారని జట్టు యజమాని నెస్ వాడియా అభిప్రాయపడ్డారు. ఈ సీజన్​ సగం మ్యాచ్​లకు దూరమైన విధ్వంసక క్రిస్​ గేల్.. వచ్చే ఏడాది పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్​లోనూ ఉంటాడని తెలిపారు. కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​, నికోలస్​ పూరన్​, క్రిస్​ గేల్, పేసర్​ షమి రూపంలో మంచి కూర్పు లభించిందని అన్నారు. యువ క్రికెటర్లు అర్ష్​దీప్​ సింగ్​, రవి బిష్ణోయ్​ ప్రదర్శనల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

"కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టులో స్థిరమైన ఆటగాళ్ల బృందం ఉండటం సంతోషం. కానీ మిడిల్​ ఆర్డర్​, డెత్​ ఓవర్లలో బౌలింగ్​ సమస్యలను అధిగమించాలి. కెప్టెన్సీ, కోచింగ్​లో చాలా మార్పులు చేసినట్లుగా జట్టునూ సరిదిద్దాలనుకుంటున్నాం. రాహుల్​ కెప్టెన్​గా చాలా బాగా ఆకట్టుకున్నాడు. అతడు ఉండటం మా అదృష్టం. షమి కూడా చాలా తెలివైన బౌలర్​. పూరన్​, రవి బిష్ణోయ్​, అర్ష్​దీప్​ సింగ్​లు మంచి ప్రదర్శన చేశారు"

- నెస్ వాడియా, పంజాబ్ జట్టు​ యజమాని

జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం, వచ్చే సీజన్​లో ప్రతి మ్యాచ్​లోనూ గేల్ ఆడతాడని నెస్ వాడియా చెప్పారు. యూఏఈ వేదికగా ఇటీవల జరిగిన సీజన్​లో ఏడు మ్యాచ్​లాడి 41.14 యావరేజ్​తో 288 పరుగులు చేశాడు. రాజస్థాన్​తో మ్యాచ్​లో 99 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Last Updated : Nov 20, 2020, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.