అబుదాబి వేదికగా జరగబోయే టీ10 లీగ్ నాలుగో సీజన్ వచ్చే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఇందులో 8 జట్లు ఆడనున్నాయి. ఈసారి క్రిస్‌గేల్(వెస్టిండీస్), డ్వేన్ బ్రావో(వెస్టిండీస్), షాహిద్ అఫ్రిదీ(పాకిస్థాన్) లాంటి స్టార్ ఆటగాళ్లు సందడి చేయనున్నారు. ఇందులో ఆడేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.
"ఫార్మాట్ ఎంత చిన్నదైతే ఆట మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అబుదాబిలోని క్రికెట్ స్టేడియంలో ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గేల్ తుపాన్ వస్తోంది" అని గేల్ అన్నాడు. "ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన స్టేడియాలలో ఒకటైన ఈ మైదానంలో ఆడటానికి ఎదురు చూస్తున్నానని" అఫ్రిదీ తెలిపాడు.
ఈ లీగ్‌లో గేల్(అబుదాబి), అఫ్రిది(ఖలందర్స్), బ్రావో(దిల్లీ బుల్స్), రసెల్(నథరన్ వారియర్స్), నరైన్(డెక్కన్ గ్లాడియేటర్స్), షోయబ్ మాలిక్(మరాఠా అరేబియన్స్), థిసారా పెరెరా(పుణె డెవిల్స్), ఇసూరు ఉదానా(బంగ్లా టైగర్స్) వేర్వేరు జట్ల తరఫున ఆడనున్నారు.
ఇదీ చూడండి : క్రికెట్లో కొత్త ఫార్మాట్.. బరిలో యువీ, గేల్