ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. తాజాగా తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు. ఓ రెండు ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జెర్సీ వేసుకొని క్యాచ్ జారవిడిచిన ఫొటో ఒకటి. రెండోది తన ఇద్దరి కూతుళ్లను ఆప్యాయంగా హత్తుకున్న చిత్రం. ఈ రెండు ఫొటోలు పెట్టి తనపై తానే సెటైర్ వేసుకున్నాడు.
"గౌతమ్.. క్రికెటర్, టెర్రిబుల్ క్యాచర్ !!! తండ్రిగా గౌతమ్, అసాధారణమైన క్యాచర్ !!!" -ట్విట్టర్లో గౌతమ్ గంభీర్
2018 డిసెంబరులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడీ గంభీర్. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా తరఫున ఎంపీగా విజయం సాధించాడు.
ఇది చదవండి: ఇమ్రాన్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన సెహ్వాగ్