ETV Bharat / sports

'అతడిని స్లెడ్జింగ్​ చేయడంలో ఉన్న ఆనందమే వేరు' - పాంటింగ్ గురించి గంభీర్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్​ను స్లెడ్జింగ్​ చేయడం ఆస్వాదించానని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అతడు భారత్​లో అంతగా రాణించిందేమీ లేదని చెప్పుకొచ్చాడు.

Gautam Gambhir recalls his Sledging incident with Ricky Ponting
గంభీర్
author img

By

Published : Jun 19, 2020, 11:08 AM IST

Updated : Jun 19, 2020, 11:58 AM IST

మైదానంలో ప్రత్యర్థి కవ్వింపులకు తనదైన శైలిలో సమాధానమిస్తాడు టీమ్​ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్. ఐపీఎల్​లో ఒకసారి విరాట్ కోహ్లీతోనూ వాగ్వాదానికి దిగాడు. అలాంటి క్రికెటర్ ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్​ను స్లెడ్జింగ్ చేయడాన్ని ఆస్వాదించినట్లు తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతీ "ఆటలో ఎవరిని స్లెడ్జింగ్ చేసి బాగా ఆస్వాదించావు" అన్న ప్రశ్నకు పాంటింగ్ పేరు చెప్పాడు.

"అది 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌. అనిల్‌ కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. బెంగళూరులో తొలి టెస్టు సందర్భంగా నేను డబుల్‌ సెంచరీ చేశా. అప్పుడు రికీ పాంటింగ్‌ సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. అదే సమయంలో నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. 'నువ్వు ప్రపంచంపైన ఏమాత్రం ప్రభావం చూపలేదు' అని అన్నాడు. దాంతో నేను కూడా అంతే దీటుగా స్పందించా. 'నువ్వు కూడా భారత్‌ గడ్డపై చేసిందేం లేదు. నిజం చెప్పాలంటే నువ్విక్కడ విఫలమయ్యావు‌' అని బదులిచ్చా. అతడి రికార్డులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తాయి. భారత్‌లో పాంటింగ్‌ చేతకానివాడు."

-గంభీర్, మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియా మాజీ సారథి పాంటింగ్ గణంకాలు నిజంగానే భారత్‌లో గొప్పగా ఏమీ లేవు. ఇక్కడ 14 టెస్టులు ఆడిన పాంటింగ్‌ 26.48 సగటుతో 662 పరుగులు చేశాడు.

Last Updated : Jun 19, 2020, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.