పోర్న్ వృత్తి... కొన్ని దేశాల్లో అధికారికంగా నడుస్తోన్న ఉద్యోగం. కొందరు ఇష్టం లేకపోయినా బతుకుదెరువు కోసం చేస్తుంటారు. మరికొందరు అందులోంచి బయటపడేందుకు సమయం కోసం ఎదురు చూస్తుంటారు.
గతంలో పోర్న్‌స్టార్‌గా చేసిన సన్నీలియోనీ... ఆ వృత్తిని వదిలి నటిగా కొనసాగుతోంది. ఇలానే న్యూజిలాండ్‌కు చెందిన 51 ఏళ్ల గార్త్ స్టిరాట్... పోర్న్ వృత్తిని వదిలి అంపైర్‌గా మారాడు.
బంతులు అందిచడమే...
గార్త్ స్టిరాట్... ఇటీవలే జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మూడో టీ20కి నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంతి పోయినా, ఆకారం మారి ఆటకు పనికి రాకపోయినా మరో బంతి ఇచ్చేందుకు, ఆ బంతుల బాక్స్‌ను గ్రౌండ్‌లోకి తీసుకు రావడమే అతడి విధి.
గార్త్... గతంలోనూ న్యూజిలాండ్ ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎన్నికయ్యాడు. అయితే అతడి పోర్న్ చిత్రాలు ఓ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయని, స్టీవ్ పార్నెల్ పేరుతో నీలి చిత్రాల్లోనూ నటించాడనే విషయం తెలిసింది. అంతే నిర్ధక్షిణ్యంగా ఆ పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత క్రికెట్‌లో అడుగుపెట్టి ఎన్నో అంతర్జాతీయ మహిళా క్రికెట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు.