ETV Bharat / sports

'వైద్య పరీక్షల అనంతరమే గంగూలీ చికిత్సపై క్లారిటీ'

స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి గురువారం పలు వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు ఆస్పత్రికి చెందిన ఓ సీనియర్​ వైద్యాధికారి. పరీక్షల ఫలితాల ఆధారంగానే దాదాకు ఎలాంటి చికిత్స అందించాలనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ganguly
గంగూలీ
author img

By

Published : Jan 28, 2021, 1:29 PM IST

ఛాతీలో అసౌకర్యంతో కోల్​కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి గురువారం పలు వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు ఆస్పత్రిలోని ఓ సీనియర్​ వైద్యాధికారి. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగానే దాదాకు స్టంట్​ వేయాలా వద్దా.. తదుపరి ఎలాంటి చికిత్స అందించాలనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గంగూలీ ఆరోగ్యంపై వాకబు చేసినట్లు దాదా కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. అతడు త్వరగా కోలుకోవాలని సీపీఎం సీనియర్​ నాయకడు అశోక్​ భట్టాచార్య ప్రార్థించారు.

స్వల్ప అస్వస్థతతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బుధవారం మధ్యాహ్నం మరోసారి ఆసుపత్రిలో చేరారు. కొన్నాళ్ల క్రితమే దాదాకు గుండెనొప్పి రాగా.. పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల పూడికలు వచ్చినట్టు గుర్తించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేశారు. రెండు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ఇదీ చూడండి: సౌరభ్​ గంగూలీ ఆరోగ్యంపై ఆస్పత్రి క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.