బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆదివారం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజాగా రెండోసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఈ మాజీ క్రికెటర్‌ను మూడు రోజుల చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.
"గంగూలీ ఆరోగ్యం బాగుంది. శస్త్రచికిత్స అనంతరం అతని గుండె మునుపటి లాగే పని చేస్తుంది. అనుకున్న దానికంటే త్వరగానే కోలుకున్నారు. అతి కొద్ది రోజుల్లోనే తిరిగి ఆయన సాధారణ స్థితికి వస్తారని ఆశిస్తున్నాం. కొన్ని నెలల పాటు ఆయన మందులు వాడాల్సిన అవసరం ఉంది" అని సీనియర్ వైద్యుడు ఒకరు వెల్లడించారు.
ఛాతీలో స్వల్ప అస్వస్థతతో గత బుధవారం ఆసుపత్రిలో చేరిన గంగూలీకి.. గురువారం మరో రెండు స్టెంట్లు వేశారు. ప్రముఖ కార్డియాలజిస్టులు డా.దేవి శెట్టి, డా.అశ్విన్ మెహతాలు ఆయనుకు యాంజియోప్లాస్టీ చేశారు.
ఇదీ చదవండి: మరో రెండు రికార్డులకు చేరువలో కోహ్లీ!