బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై వుడ్ల్యాండ్స్ ఆస్పత్రి బుధవారం మరో బులిటిన్ విడుదల చేసింది. ఆయనను గురువారం డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించింది.
"గంగూలీని రేపు (గురువారం) డిశ్చార్జ్ చేస్తాం. ఈరోజూ(బుధవారం) ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మా వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంట్లో ఎలాంటి చికిత్సను అందించాలనే విషయాన్ని డాక్టర్లు చర్చిస్తున్నారు" అని వుడ్ల్యాండ్స్ ఆస్పత్రి ప్రకటనలో తెలిపింది.
గుండె సంబంధిత వ్యాధి నిపుణులు డాక్టర్ దేవీశెట్టి.. గంగూలీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. బుధవారం డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే దాదాకు బుధవారం కూడా చికిత్స అందిస్తున్నామని తెలియజేయడం అభిమానుల్లో అందోళనకు తావిస్తోంది.
ఇదీ చూడండి: బుధవారం గంగూలీ డిశ్చార్జ్.. ఇంట్లోనే చికిత్స!