ETV Bharat / sports

విజయాల సారథి.. శతకాల వారధి..ఈ సవ్యసాచి! - captain

క్రికెట్​తో... విదేశాల్లో భారత జెండాను ఎగురవేసి, వరుస విజయాలతో ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు సౌరవ్ గంగూలీ. నేడు దాదా 47వ పుట్టినరోజు సందర్భంగా అతడిపై ఓ లుక్కేద్దాం!

గంగూలీ
author img

By

Published : Jul 8, 2019, 7:15 AM IST

Updated : Jul 8, 2019, 9:50 AM IST

మ్యాచ్​​ ఫిక్స్​ కుంభకోణం.. జట్టు సమష్టిగా ఆడటంలో విఫలం... కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సచిన్​.. ఇవన్నీ టీమిండియా అప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు. అలాంటి పరిస్థితుల్లో సారథ్య బాధ్యతలు చేపట్టి గమ్యంలేని నడక సాగిస్తున్న భారత జట్టును సరైన మార్గంలో పరుగులు తీయించిన క్రికెటర్​ సౌరవ్​ గంగూలీ. 2000-05 మధ్యకాలంలో టీమిండియాకు కెప్టెన్​గా ఉండి తనదైన మార్కు చూపించిన దిగ్గజం.

కెప్టెన్​గానే కాకుండా ఆటగాడిగానూ సత్తాచాటి విదేశాల్లో భారత​ గెలుపు ప్రస్థానానికి సరైన బాటలు వేసిన కెప్టెన్ గంగూలీ. నేడు దాదా పుట్టినరోజు. 1972 జులై 8న కోల్​కతాలో జన్మించిన గంగూలీ క్రికెట్​ కెరీర్​లో కొన్ని మలుపురాని ఇన్నింగ్స్​లు​ ఇప్పుడు చూద్దాం!

అరంగేట్ర టెస్టులోనే శతకం..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1996లో లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​పై జరిగిన టెస్టుతో గంగూలీ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి టెస్టులోనే శతకంతో విజృంభించాడు. అనంతరం అదే సిరీస్​లో ఆడిన రెండో టెస్టులోనూ సెంచరీ సాధించాడు. ఇలా తొలి రెండు టెస్ట్​ మ్యాచ్​ల్లో ​శతకాలు చేసిన భారత బ్యాట్స్​మన్​గా రికార్డులకెక్కాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగానూ గంగూలీ నిలిచాడు.

రెండు చేతులతో ఆడగల సవ్యసాచి..

గంగూలీ అనగానే అతడి ఎడమ చేతి వాటం బ్యాటింగ్​.. ఆఫ్ సైడ్​ దిశగా అతడు కొట్టే కవర్​ డ్రైవ్​లే గుర్తుకువస్తాయి. అయితే సౌరవ్ కుడి చేత్తో కూడా బ్యాటింగ్​ చేయగలడు. 1999 ప్రపంచకప్​ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్​లో కుడి చేత్తో బ్యాటింగ్ చేశాడు గంగూలీ. ఆ మ్యాచ్​లో 97 పరుగులతో ఆకట్టుకుని సవ్యసాచి అనిపించుకున్నాడు. ఇలా కొన్ని అంతర్జాతీయ మ్యాచ్​ల్లో తన బ్యాటింగ్​ ప్రతిభ చూపాడు.

ప్రపంచకప్​లో ఇప్పటికీ దాదానే కింగ్..

వరల్డ్​కప్​ టోర్నీల్లో అత్యుత్తమ వ్యక్తిగత పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు గంగూలీ. 1999 ప్రపంచకప్​లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 183 పరుగులతో విజృంభించాడు దాదా. ఇందులో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటికీ మెగాటోర్నీలో ఓ భారత ఆటగాడి అత్యత్తుమ వ్యక్తిగత స్కోరు ఇదే. ఈ మ్యాచ్​లో ద్రవిడ్​తో కలిసి 318 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా శ్రీలంకపై 157 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా.

లార్డ్స్​లో చొక్కా విప్పిన వేళ...

2002లో ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన నాట్​వెస్ట్ వన్డే సిరీస్​ను భారత క్రికెట్​ ప్రేమికులు అంత త్వరగా మర్చిపోలేరు. లార్డ్స్​లో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో ఇంగ్లీష్ జట్టును ఓడించింది టీమిండియా​. ఆ మ్యాచ్​లో 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. గంగూలీ (60), కైఫ్ (87*), యువరాజ్(69) అర్ధశతకాలతో ఆకట్టుకుని జట్టును గెలిపించారు. ఈ ఉత్కంఠ విజయం అనంతరం గంగూలీ... తన చొక్కా విప్పి గాల్లోకి ఎగరేసి సందడి చేశాడు.

చివర్లో గాడి తప్పిన బ్యాటింగ్​..

ఎన్నో అద్భుత ఇన్నింగ్స్​లు​ ఆడి టీమిండియా జైత్రయాత్రలో ఎనలేని పాత్ర పోషించిన గంగూలీ.. మెల్లమెల్లగా బ్యాటింగ్​లో విఫలమవుతూ వచ్చాడు. 2003 ప్రపంచకప్ అనంతరం ఫామ్​ కోల్పోయాడు. 2005 పాకిస్థాన్​ సిరీస్​లో ఘోరంగా విఫలమైన సౌరవ్..​ అనంతరం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం.. జట్టులో స్థానాన్నీ కోల్పోయాడు. జట్టులోకి వస్తూ, పోతూ తీవ్రవిమర్శలు ఎదుర్కొన్నాడు. 2007లో క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

అగ్రశ్రేణి ఆటగాళ్లను పరిచయం..

యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్​, గౌతమ్ గంభీర్, మహేంద్రసింగ్ ధోనీ లాంటి అగ్రస్థాయి ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్​కు పరిచయం చేశాడు దాదా. సౌరవ్ కెప్టెన్​గా వచ్చిన తర్వాతే టీమిండియా క్రికెట్ రూపురేఖలు మారాయి.

113 టెస్టులు ఆడిన గంగూలీ 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. 311 వన్డేల్లో 11,313 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 72 అర్ధసెంచరీలు ఉన్నాయి.

గంగూలీ రికార్డులు..

  • వరుసగా నాలుగు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డులు అందుకున్న ఏకైక ఆటగాడు దాదా.
  • ప్రపంచకప్​లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు(183) నమోదు చేసిన భారత ఆటగాడు.
  • వన్డేల్లో 10వేల పైచిలుకు పరుగులు, వందకు పైగా వికెట్లు, వందకు పైగా క్యాచ్​లు అందుకున్న ఐదుగురు క్రికెటర్లలో సౌరవ్ ఒకడు.
  • తొలి టెస్టు మ్యాచ్​లో సెంచరీ చేసి చివరి మ్యాచ్​లో మొదటి బంతికే ఔటైన ఏకైక బ్యాట్స్​మన్ సౌరవ్​ గంగూలీనే.

ఇది చదవండి: కోహ్లీకి దగ్గరగా వచ్చిన రోహిత్

Intro:Body:

e

Conclusion:
Last Updated : Jul 8, 2019, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.