ETV Bharat / sports

'ఐపీఎల్​లో మార్పులకు మేము వ్యతిరేకం' - కోల్​కతా నైట్​రైడర్స్​ సీఈఓ వెంకీ మైసూర్​

ఐపీఎల్​ను పూర్తిస్థాయిలో నిర్వహించాలని అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నట్లు తెలిపాడు కోల్​కతా నైట్​రైడర్స్​ సీఈఓ వెంకీ మైసూర్​. మినీ ఐపీఎల్​ లాంటి టోర్నీల నిర్వహణకు తామంతా పూర్తి వ్యతిరేకమని తెలిపాడు.

Franchises want full IPL and no tinkering, if it happens: KKR CEO
'ఐపీఎల్​లో మార్పులు చేస్తే ఊరుకోం'
author img

By

Published : Jun 11, 2020, 6:39 PM IST

ఐపీఎల్​ నిర్వహణలో ఎలాంటి మార్పులు లేకుండా పూర్తిస్థాయిలో జరపాలని సూచించాడు కోల్​కతా నైట్​రైడర్స్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకీ మైసూర్​. మినీ ఐపీఎల్​ లాంటి ఆలోచనలను ఫ్రాంచైజీలు ఏ మాత్రం అంగీకరించబోవని స్పష్టం చేశాడు.

"ఐపీఎల్​లో మ్యాచ్​లను కుదించి నిర్వహించాలన్న ఆలోచనకు మేము పూర్తి వ్యతిరేకం. ఇలాంటి ప్రత్యేకమైన టోర్నీని మినీ ఐపీఎల్​గా నిర్వహించడం ఫ్రాంచైజీలకు ఏ మాత్రం అంగీకారం కాదు. పూర్తిస్థాయిలో జరగాలని మేము కోరుకుంటున్నాం".

- వెంకీ మైసూర్​, కోల్​కతా నైట్​రైడర్స్​ సీఈఓ

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా మార్చి నుంచి క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. వాటిలో ఐపీఎల్​ కూడా ఉంది. కానీ, ఈ టోర్నీని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు-నవంబరు మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే.. ఆ సమయంలో ఐపీఎల్​ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఐపీఎల్​ అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినోదం పంచుతుందని అభిప్రాయపడ్డాడు కేకేఆర్​ సీఈఓ. భారత క్రికెటర్లతో పాటు టోర్నీకి వెన్నెముకైన విదేశీ ఆటగాళ్లు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోల్​కతా జట్టులో సునీల్​ నరైన్​, ఆండ్రూ రస్సెల్​, ఇయాన్​ మోర్గాన్​ ఇప్పుడు పాట్​ కమిన్స్ ముఖ్యమైన ఆటగాళ్లని గుర్తు చేశాడు.

ఇదీ చూడండి... వైరల్: క్వారంటైన్​ కేంద్రంలో క్రికెట్ ఆడుతూ కాలక్షేపం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.