ETV Bharat / sports

నల్ల కోళ్ల వ్యాపారంలోకి మహేంద్ర సింగ్ ధోనీ - dhoni latest news

పలు వ్యాపారాలు చేస్తున్న ధోనీ.. ఇప్పుడు కడక్​నాథ్ కోళ్ల ఫామ్​ను నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. ధోనీ బృందం.. దాదాపు 2000 కోళ్లను ఇప్పటికే ఆర్డర్​ పెట్టినట్లు తెలుస్తోంది.

Kadaknath wins over Captain Cool MS Dhoni
కోళ్ల వ్యాపారంలోకి మహేంద్ర సింగ్ ధోనీ
author img

By

Published : Nov 12, 2020, 12:19 PM IST

Updated : Nov 12, 2020, 1:42 PM IST

అంతర్జాతీయ కెరీర్​కు ఆగస్టులో వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ.. వ్యాపారాల్లో బిజీ అయిపోతున్నాడు. అత్యధిక పోషక విలువులున్న కడక్​నాథ్​ కోళ్ల ఫామ్​ను స్వస్థలం రాంచీలో​ త్వరలో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడి బృందం, 2000 కోళ్ల కోసం ఆర్డర్​ పెట్టినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్​ జబువా జిల్లాకు చెందిన ఓ పౌల్ట్రీ యజమానితో ధోనీ బృందం ఇప్పటికే సంప్రదింపులు జరిపిందని, డిసెంబరు 15లోగా 2000 కోళ్లను తమకు దిగుమతి చేయాలని కోరినట్లు పౌల్ట్రీ యజమాని వెల్లడించారు. ఇప్పటికే అడ్వాన్స్ అందిందని, దేశంలో ప్రముఖ క్రికెటర్లలో ఒకరికి తాను కడక్​నాథ్ కోళ్లు అమ్ముతుండటం తనకెంతో గర్వకారణమని సదరు యజమాని పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్​లోని జబువా జిల్లాలో లభించే ఈ కడక్​నాథ్ కోళ్లకు 2018లోనే జీఐ ట్యాగ్​ కూడా లభించింది.

ఇది చదవండి: సేంద్రీయ ఎరువులకు అంబాసిడర్​గా ధోనీ

Last Updated : Nov 12, 2020, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.