ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను ఉదాహరణగా చూపిస్తూ.. విద్యార్థుల్లో ప్రేరణ నింపడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపాడు భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో కలిసి ప్రధాని ఇటీవల 'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే పేరును మోదీ ప్రస్తావించారు. 2002లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ స్పిన్నర్ కుంబ్లే.. గాయాన్ని లెక్కచేయకుండా దేశం కోసం ఆటను కొనసాగించారని గుర్తుచేశారు.
మోదీ తన పేరు ప్రస్తావించడంపై కుంబ్లే ఇవాళ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు ఈ మాజీ లెగ్ స్పిన్నర్.
"పరీక్షా పే చర్చా- 2020 కార్యక్రమంలో నా గురించి చెప్పడం గర్వంగా ఉంది. థ్యాంక్యూ మోదీజీ. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్" అని ట్వీట్ చేశాడు కుంబ్లే. ఈ పోస్టుకు మోదీ మాట్లాడిన వీడియోను జతచేశాడు.
-
Honoured to have been mentioned in #ParikshaPeCharcha2020 Thankyou Hon. PM @narendramodi ji. Best wishes to everyone writing their exams. pic.twitter.com/BwsMXDgemD
— Anil Kumble (@anilkumble1074) January 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Honoured to have been mentioned in #ParikshaPeCharcha2020 Thankyou Hon. PM @narendramodi ji. Best wishes to everyone writing their exams. pic.twitter.com/BwsMXDgemD
— Anil Kumble (@anilkumble1074) January 22, 2020Honoured to have been mentioned in #ParikshaPeCharcha2020 Thankyou Hon. PM @narendramodi ji. Best wishes to everyone writing their exams. pic.twitter.com/BwsMXDgemD
— Anil Kumble (@anilkumble1074) January 22, 2020
ఆంటిగ్వా వేదికగా 2002లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో... కుంబ్లే దవడ ఎముకకు గాయమైంది. సర్జరీ చేయాల్సిన పరిస్థితి రావడం వల్ల ఆయనను జట్టు నుంచి తప్పించాలని అనుకున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కుంబ్లే బ్యాండేజ్ వేసుకుని మ్యాచ్ కొనసాగించాడు. కుంబ్లే బ్యాండేజ్‌తో బౌలింగ్ చేస్తున్న ఫొటో.. క్రికెట్ చరిత్రలోనే గొప్ప చిత్రంగా నిలిచిపోయింది.