భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ కూతురు రూపా గురునాథ్‌కు కీలక పదవి దక్కింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత క్రికెట్లో ఓ రాష్ట్ర బోర్డుకు ప్రెసిడెంట్‌గా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
ఈ నెల 22న టీఎన్‌సీఏ అధ్యక్ష ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. గురువారం చెన్నైలో జరిగిన టీఎన్‌సీఏ 87వ వార్షిక సమావేశంలో రూపా గురునాథ్‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న గురునాథ్ మెయప్పన్ సతీమణి రూపా గురునాథ్.
ఇటీవలే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో టీఎన్సీఏలో కొంత మంది అధికారులు, కోచ్‌లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది.
ఇదీ చదవండి: కొరియా ఓపెన్ క్వార్టర్స్‌లో పారుపల్లి కశ్యప్