గత వారం రంజీ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డ భారత యువ క్రికెటర్ పృథ్వీషా.. పూర్తి ఫిట్నెస్ సాధించాడు. మరికొద్ది గంటల్లో న్యూజిలాండ్‌లో ఉన్న భారత్-ఏ జట్టుతో కలవనున్నాడు. గత కొద్ది కాలం నుంచి బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలోని పునరావస కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు షా.
-
My favourite sound. The sound when the ball hits the middle of my bat. Superb net sessions going on. pic.twitter.com/Iw8bUJXE4N
— Prithvi Shaw (@PrithviShaw) January 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My favourite sound. The sound when the ball hits the middle of my bat. Superb net sessions going on. pic.twitter.com/Iw8bUJXE4N
— Prithvi Shaw (@PrithviShaw) January 14, 2020My favourite sound. The sound when the ball hits the middle of my bat. Superb net sessions going on. pic.twitter.com/Iw8bUJXE4N
— Prithvi Shaw (@PrithviShaw) January 14, 2020
"పృథ్వీషా.. గురువారం లేదా శుక్రవారం న్యూజిలాండ్‌లో ఉన్న భారత్-ఏ జట్టుతో కలవనున్నాడు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు" -బీసీసీఐ అధికారి
ఈ మ్యాచ్‌ల్లో ఆడి, టీమిండియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు షా. అయితే అతడితో పాటే శుభ్‌మన్ గిల్.. రిజర్వ్ ఓపెనర్ స్థానం కోసం పోటీపడుతున్నాడని సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరు చెప్పారు.
వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన పృథ్వీ.. మొదటి మ్యాచ్‌లో సెంచరీ, అర్ధశతకం చేశాడు. రెండు టెస్టుల సిరీస్‌లో మొత్తంగా 237 పరుగులు సాధించాడు.