ETV Bharat / sports

'హమ్మయ్య.. ఇంగ్లాండ్​ అభిమానుల తిట్ల బాధ తప్పింది' - england fans scold warner ball tampering

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టీ20 సిరీస్​లో ప్రేక్షకులు లేకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. బాగానే ఉందన్నాడు ఆస్ట్రేలియా​ క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​. దీంతో బాల్​ ట్యాంపరింగ్ విషయమై ఇంగ్లాండ్​ క్రీడాభిమానుల తిట్ల బాధ తొలిసారిగా తప్పిందన్నాడు.

Warner
వార్నర్
author img

By

Published : Sep 5, 2020, 3:15 PM IST

అప్పట్లో ఇంగ్లాండ్​తో జరిగిన యాషెస్​ సిరీస్​లో బాల్​ ట్యాంపరింగ్​కు పాల్పడ్డారు ఆస్ట్రేలియా క్రికెటర్లు​ డేవిడ్​ వార్నర్​, స్టీవ్ స్మిత్ . దీంతో వారిపై మండిపడ్డారు ఇంగ్లీష్​ క్రీడాభిమానులు. ఇంగ్లాండ్ వేదికగా గతేడాది జరిగిన ప్రపంచకప్​లోనూ వార్నర్, స్మిత్​లను టార్గెట్ చేసుకుని విమర్శించారు.

అయితే ప్రస్తుతం ఖాళీ స్టేడియంలో ఇంగ్లాండ్​తో ఆస్ట్రేలియా టీ20 సిరీస్​ ఆడుతోంది. ఈ విషయమై స్పందించిన వార్నర్​.. ప్రేక్షకులు లేకుండా క్రికెట్​ ఆడటం కాస్త ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు. అయితే ఇలా జరగడం మంచిదేనన్నాడు. దీంతో తొలిసారిగా ఇక్కడి అభిమానుల తిట్ల నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాతో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడిన ఇంగ్లాండ్ జట్టు.. 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్​లో తమ జట్టు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు వార్నర్​. ఏదేమైనప్పటికీ కరోనా తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్​ ఆడటంపై హర్షం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి 'అభిమానుల కోసం ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.