కేప్‌టౌన్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగులుండగానే పూర్తి చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెయిర్‌స్టో(48 బంతుల్లో 86*) గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డుప్లెసిస్ 58, డికాక్ 30, వాన్డర్సెన్ 37 పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో సామ్ కరన్ 3, ఆర్చర్, టామ్ కరన్, జోర్డాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బెయిర్‌స్టో, మెల్లగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో చివరి వరకు నిలిచి 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతడికి స్టోక్స్ 37 పరుగులు చేసి కొంత సహాయం చేశాడు. సఫారీ బౌలర్లలో లిండే, ఎంగిడి తలో రెండు వికెట్లు, శాంసి ఓ వికెట్ పడగొట్టారు.
ఇది చదవండి: తొలి వన్డే: ఆసీస్ ఘనతలు.. భారత్ చెత్త రికార్డులివే..