తొలి టెస్టులో ఇంగ్లాండ్‌తో ఘోర పరాభవం తర్వాత బౌలింగ్‌లో పలు మార్పులకు యత్నిస్తోంది టీమ్ఇండియా. నలుగురు స్పిన్నర్లను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ప్రాక్టీస్ చేస్తున్న చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. తుది జట్టులో అతడి ఎంపికను నిర్ధరించనప్పటికీ తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్‌ను తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సుందర్, కుల్దీప్లపైనే మాజీల మొగ్గు..
బౌలింగ్‌లో విఫలమైనా.. బ్యాటింగ్‌లో విశేషంగా రాణిస్తున్న యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో చోటు నిలుపుకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మాజీ సెలక్టర్లు ఇదే చెబుతున్నారు. అయితే మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్‌ల నుంచి సుందర్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది.
బౌలింగ్‌లో అటాక్ కోసం నదీమ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ను తీసుకోవాలని మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపే సూచించారు. రాహుల్ నైపుణ్యవంతుడని అయితే ఒత్తిడిలో కుల్దీప్ బాగా రాణిస్తాడని చెప్పారు మరో మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
ఇదీ చూడండి: తొలిటెస్టులో భారత్ ఓటమి.. క్యూరేటర్ తొలగింపు!