ప్రపంచకప్ ముందు పాకిస్థాన్ జట్టులో ఫీల్డింగ్ లోపాలు కలవరపెడుతున్నాయని ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ చెప్పాడు. ఈ అంశంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు.
తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది పాక్ జట్టు. ఈ మ్యాచ్‌ల్లో ఇరుజట్లు 300కు పైగా స్కోర్లు సాధించినా అనవసర ఫీల్డింగ్ తప్పిదాల వల్ల పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లను కోల్పోయింది. అదే ఫీల్డింగ్‌లో రాణించిన ఇంగ్లాండ్ సిరీస్‌ను 4-0 తేడాతో కైవసం చేసుకుంది.
"మా జట్టు ఫీల్డింగ్ పట్ల అసంతృప్తిగా ఉన్నాం. ఇంగ్లాండ్‌కు, పాక్‌కు మధ్య స్పష్టమైన తేడా అదే. అన్ని మ్యాచ్‌ల్లో చాలా బాగా పోరాడాం. ప్రపంచకప్ జట్టు పట్ల సంతృప్తిగా ఉన్నాం. ముందు రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌పై దృష్టిపెడతాం. మెగాటోర్నీలో మా వాళ్లు సత్తాచాటుతారని ఆశిస్తున్నా".
-మికీ ఆర్థర్, పాకిస్థాన్ జట్టు కోచ్
ప్రపంచకప్ మ్యాచ్‌లకు ముందు పాక్ జట్టు మే 24న అప్గానిస్థాన్‌తో, 26న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. మెగాటోర్నీ తొలిపోరులో మే 31న వెస్టిండీస్‌తో తలపడనుంది.
ఇవీ చూడండి.. గెలిస్తేనే దక్కుతుంది పరువు: వెసెల్స్