ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ. అయితే జట్టును ప్రకటించగానే సెలక్షన్ కమిటీ తీరుపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. అనూహ్యంగా సీనియర్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించిన బీసీసీఐ.. యువ ఆటగాళ్ల విషయంలోనూ మరోసారి వివక్ష చూపింది.
ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్, దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు చోటు కల్పించకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరో ఆటగాడు మనోజ్ తివారి స్పందించాడు.
"అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్ కష్టపడినా ఫలితం దక్కలేదు. మీరు ఇలాంటి శకంలో పుట్టి ఆడటం వల్లనే చోటు దక్కట్లేదని కొందరు అంటున్నారు. కానీ మీరు మిగతా వారికంటే మెరుగైన ప్రదర్శన చేయగలరు."
-మనోజ్ తివారి, టీమ్ఇండియా క్రికెటర్
ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన టీ20 జట్టులో కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు లభించింది.
-
ICYMI - #TeamIndia squads for three T20Is, three ODIs & four Test matches against Australia.#AUSvIND pic.twitter.com/HVloKk5mw0
— BCCI (@BCCI) October 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ICYMI - #TeamIndia squads for three T20Is, three ODIs & four Test matches against Australia.#AUSvIND pic.twitter.com/HVloKk5mw0
— BCCI (@BCCI) October 26, 2020ICYMI - #TeamIndia squads for three T20Is, three ODIs & four Test matches against Australia.#AUSvIND pic.twitter.com/HVloKk5mw0
— BCCI (@BCCI) October 26, 2020
టీ20 జట్టు: కోహ్లీ(కెప్టెన్), ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, జడేజా, వాషింగ్టన్ సుందర్, చాహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి
వన్డే జట్టు: కోహ్లీ(కెప్టెన్), ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్ ఠాకుర్
టెస్టు జట్టు: కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, వృద్ధిమన్ సాహా, పంత్, బుమ్రా, షమీ, ఉమేశ్ యాదవ్, సైనీ, కుల్దీప్ యాదవ్, జడేజా, అశ్విన్, సిరాజ్