ETV Bharat / sports

ఓ పోస్ట్ కలిపింది వారిద్దరినీ.. ఎలా అంటే? - క్రికెట్ వార్తలు

సిడ్నీ స్టేడియంలో మ్యాచ్​ జరుగుతుండగా ఒక్కటైన భారత అబ్బాయి- ఆస్ట్రేలియా అమ్మాయి జోడీ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఈమధ్య ఎక్కడ చూసిన వీరి వీడియోనే దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వీరు ఎలా, ఎప్పుడు, ఎక్కడ కలిశారనే విషయాన్ని తెలుసుకుందాం.

Fan who proposed to girlfriend in ODI reveals they met because of mail
సిడ్నీలో భారత్ అబ్బాయి ఆసీస్ అమ్మాయి
author img

By

Published : Dec 3, 2020, 5:24 PM IST

భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే కంటే ఆ మ్యాచ్​లో భారత అబ్బాయి-ఆసీస్ అమ్మాయికి చేసిన 'ప్రేమ ప్రపోజల్' చాలా చర్చనీయాంశమైంది. అయితే వారిద్దరూ స్టేడియంలోనే తొలిసారి కలుసుకున్నారా? లేదా అంతకుముందు ఒకరికి ఒకరు పరిచయముందా? అనే అనుమానం చాలామందికి వచ్చింది. సోషల్ మీడియాలోనూ వారి గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడు వీటన్నింటికి ఫుల్​స్టాప్​ పెడుతూ తమ రిలేషన్​ గురించి, తొలిసారి కలుసుకున్న సందర్భం గురించి చెప్పాడు డిపెన్ మండలియా(భారత్ అబ్బాయి).

"2018 అక్టోబరులో సిడ్నీ నుంచి మెల్​బోర్న్​కు మారా. కొత్త అపార్ట్​మెంట్​కు వెళ్లిన తర్వాత పోస్ట్​ ద్వారా మెయిల్స్​ వచ్చాయి. అవి నా కోసం కాదని, అంతకుముందు ఇదే ఇంట్లో ఉన్న వారి కోసం అని అర్థమైంది. ఆ వ్యక్తిని నేరుగా కలిసి సదరు మెయిల్​ను ​ఇవ్వాలని అనుకున్నా. ఆ మెయిల్​ రోజిలీ వింబుష్(రోజ్​) అనే అమ్మాయి కోసం అని తెలిసింది. ఫేస్​బుక్​లోని ఓ ప్రైవేట్​ గ్రూప్​ ద్వారా ఆమెను సంప్రదించి, మెయిల్ ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని చెప్పా. అలా మేం తొలిసారి కలిశాం. అయితే అప్పుడు మాట్లాడటానికి నేను కొంచెం భయపడటం వల్ల కేవలం 10 సెకన్లలో మా సంభాషణ పూర్తయింది. ఆమెకు మెయిల్​ ఇచ్చి బాయ్​ చెప్పి ఎవరి దారిన వారు వెళ్లిపోయాం."

"మరో నెల తర్వాత పోస్ట్​లో మరో మెయిల్ వచ్చింది. దీంతో ఆమెకు మెసేజ్ చేసి నేరుగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పా. ఈసారి మాత్రం మెయిల్​ ఇవ్వాలనుకున్నందుకు కృతజ్ఞతగా కాఫీ ఆఫర్ చేసింది. అలా రెండోసారి కలిశాం. 10 నిమిషాలు అనుకున్న మేము దాదాపు 2 గంటల పాటు మాట్లాడుకున్నాం. అలా ఆ తర్వాత డిన్నర్​కు, డ్రింక్స్​ కోసం కలిశాం. అలా అలా మా భావాలు, ఆలోచనలు, ఇష్టాలు కలిశాయి. దీంతో ప్రాంతాలు, దేశాలు వేరైనా సరే ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నాం" అని డిపెన్ ఇన్​స్టాలో పోస్ట్ పెట్టారు.

ఇది చదవండి: భారత్-ఆస్ట్రేలియా వన్డే​లో 'లవ్ ప్రపోజల్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.