క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తికి ఎంతో విలువుంటుంది. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ ఆటగాళ్లు ఎలా ఆడారనేదే చాలా ముఖ్యం. అందుకు సంబంధించి 'ఫెయిర్ ప్లే' నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6)ను రనౌట్ చేసిన విధానం క్వింటన్ డికాక్‌కు చెడ్డపేరు తెచ్చేలా ఉంది. అది నిజంగానే క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా కనిపిస్తోంది.
తొలుత ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ సాధించింది. డికాక్(80), కెప్టెన్ బవుమా(92), వాండర్ డసెన్(60), మిల్లర్(50) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఒకవైపు ఓపెనర్ జమాన్ వికెట్ కాపాడుకుంటూ ఒంటరి పోరాటం చేస్తుండగా మరోవైపు వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలోనే చివరి ఓవర్‌లో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో జమాన్(192) పరుగులతో ద్విశతకానికి చేరువలో ఉన్నాడు.
-
The law of the game ... YES. but shouldn’t the batsman be running harder and watch the ball 🤷♂️ or follow the ball .. he seems to be in slow motion here https://t.co/e3gM4abWzQ
— Russel Arnold (@RusselArnold69) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The law of the game ... YES. but shouldn’t the batsman be running harder and watch the ball 🤷♂️ or follow the ball .. he seems to be in slow motion here https://t.co/e3gM4abWzQ
— Russel Arnold (@RusselArnold69) April 5, 2021The law of the game ... YES. but shouldn’t the batsman be running harder and watch the ball 🤷♂️ or follow the ball .. he seems to be in slow motion here https://t.co/e3gM4abWzQ
— Russel Arnold (@RusselArnold69) April 5, 2021
ఇదీ చదవండి: కుర్రాళ్లు.. తొలి అవకాశం అందుకుంటారా?
అయితే, ఎంగిడి వేసిన తొలి బంతికి డబుల్ రన్ తీయబోయిన జమాన్ రెండో పరుగు పూర్తి చేసే సమయంలో ఔటయ్యాడు. ఫీల్డర్ మార్‌క్రమ్ డైరెక్ట్ త్రో విసరాడు. దీంతో పెవిలియన్ చేరాడు. కానీ, ఇక్కడే దక్షిణాఫ్రికా కీపర్ క్వింటన్ డికాక్ ఓ మాయ చేశాడు. జమాన్ రెండో పరుగు కోసం క్రీజులోకి వస్తుండగా ఫీల్డర్ త్రో విసిరిన బంతి నాన్ స్ట్రైకర్ వైపు వెళ్తున్నట్లు సైగలు చేశాడు. పాక్ బ్యాట్స్‌మన్ అటువైపు తిరిగి చూశాడు. ఈలోపే బంతి వికెట్లకు తాకింది. దీంతో అతడు రనౌటయ్యాడు.
రీప్లేలో డికాక్ ఉద్దేశపూర్వకంగా జమాన్‌ను మాయ చేసే విధంగా కనిపించింది. చివరకు పాక్ 50 ఓవర్లలో 324/9తో నిలిచింది. దక్షిణాఫ్రికా 17 పరుగులతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే జమాన్ వన్డేల్లో రెండో ద్విశతకం చేజార్చుకున్నాడు. దీన్ని పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టారు. డికాక్ చేసింది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
ఇదీ చదవండి: 'మహీ' తొలి అంతర్జాతీయ శతకానికి పదహారేళ్లు