పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ వన్డేల్లో రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 193 పరుగులు చేసిన ఇతడు.. రెండో ఇన్నింగ్స్లో ఎక్కువ పరుగుల చేసిన బ్యాట్స్మన్గా ఘనత సాధించాడు. ఇతడి తర్వాత స్థానాల్లో షేన్ వాట్సన్(185*), ధోనీ(183*), కోహ్లీ(183) ఉన్నారు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. 341/6 పరుగులు చేసింది. ఛేదనలో ఓ దశలో 120/5తో ఉన్న పాక్ జట్టులో ఫకర్ జమాన్ ఒంటరి పోరాటం చేశాడు. దాదాపు గెలిపించినంత పనిచేశాడు. కానీ 193 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడం వల్ల సఫారీ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.