ఇటీవల దిల్లీ కెప్టెన్‌గా ఎంపికైన రిషభ్ పంత్‌ను కొనియాడాడు ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్. కెప్టెన్‌గా రిషభ్.. ఆటను చక్కగా అర్థం చేసుకుంటాడని, అదనపు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తాడని కితాబిచ్చాడు.
"నాకు తెలిసి పంత్ ఈ అదనపు బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడు. ప్రధాన ఆటగాడిగా కావాలనుకుంటాడు. నాయకుడిగా ఎదగాలనుకునే వ్యక్తిత్వం అతనిది. టోర్నీలో పంత్ ఎలా ముందుకెళ్తాడో చూడాలని ఉంది. కొత్త బాధ్యతల విషయంలో అతనికి సాయం అందించడానికి మేము సిద్ధం. కానీ, నిజంగా చెప్తున్న అతడు మా నుంచి ఎక్కువ సాయం తీసుకోకపోవచ్చు."
-రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్.
"పంత్‌కు శిక్షణ అప్పుడే కాకుండా మ్యాచ్‌ల సమయంలోనూ కెప్టెన్సీలో సాయం చేయనున్నాం. మొదటి మ్యాచ్‌కు ముందు అతడితో సారథ్యం గురించి ఎక్కువగా మాట్లాడితే దాని గురించి ఆందోళన చెందడు" అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
పంత్ ఇటీవల ఫామ్‌పై స్పందించాడు పాంటింగ్. తొలి సారి అతడ్ని చూసినప్పటి నుంచే ఎంత ప్రతిభావంతుడనే విషయం అర్థమైందన్నాడు. ఇటీవల ఆసీస్‌తో రెండో టెస్టులో అద్భుతంగా ఆడాడని తెలిపాడు. గత ఆరేడు నెలలుగా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్: హోమ్ టీమ్‌లో ఆడని క్రికెటర్లు!
ఇదీ చదవండి: శ్రీలంక తొలి టీ20 ప్రపంచ కప్‌కు ఏడేళ్లు