ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​ను ఐపీఎల్​తో భర్తీ చేయాలి' - మాంట పారెసన్​ న్యూస్​

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్​ వాయిదా పడితే.. ఆ సమయంలో ఐపీఎల్​ను నిర్వహించాలని ఇంగ్లాండ్​ సీనియర్​ క్రికెటర్​ మాంటీ పనేసర్​ తెలిపాడు. తాజాగా ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన పనేసర్​.. అనేక విషయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.

Exclusive: Monty Panesar feels IPL should replace men's T20 World Cup in OCT-NOV
'టీ20 ప్రపంచకప్​ను ఐపీఎల్​తో భర్తీ చేయాలి'
author img

By

Published : Jun 25, 2020, 5:34 AM IST

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ను వాయిదా వేస్తే ఆ సమయంలో ఐపీఎల్​ నిర్వహించాలని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్​ సీనియర్​ క్రికెటర్​​ మాంటీ పనేసర్​. ఇతర దేశాల నుంచి ఆటగాళ్లు రావడం వల్ల.. కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. తాజాగా ఈటీవీ భారత్​కు ఇచ్చిన​ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన పనెేసర్​.. టీ20 ప్రపంచ కప్​ వాయిదా పడితే, ఐపీఎల్​తో భర్తీ చేసే అవకాశంతో పాటు, అనేక విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించాడు మాంటీ.

మాంటీ పారెసన్ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఏటా ఎంతో ఉత్కంఠగా సాగే ఐపీఎల్​ టోర్నీ.. కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​తో నిరవధిక వాయిదా పడింది. అయితే, ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్​ ఉండకపోవచ్చని.. బహుశా వాయిదా పడే అవకాశం ఉందని పనేసర్​ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అలాగే జరిగితే.. అక్టోబరు- నవంబరు నెలల్లో ఐపీఎల్​ నిర్వహించాలని సూచించాడు.

ఐపీఎల్​ను భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ).. విదేశాల్లో జరపాల్సిన పరిస్థితులేమైనా రావచ్చా? అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు మాంటీ.

"బీసీసీఐ కచ్చితంగా ఈ విషయంపై సాధ్యమైనంత వరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఇంగ్లాండ్​ చూసుకుంటే.. పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి విషయంలో భారత్​ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. జూన్​ చివరి నాటికి, జులై మధ్య లేదా ఆగస్టు ప్రారంభం నాటికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. ఇది చాలా భిన్నమైన అంశం."

- మాంటీ పనేసర్, ఇంగ్లాండ్​ సీనియర్​ క్రికెటర్​​

తదుపరి టీ20 ప్రపంచకప్​ ఆస్ట్రేలియాలోనే..!

2021లో టీ20 ప్రపంచ కప్​, మహిళల వన్డే ప్రపంచ కప్​లకు భారత్​ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే.. ఒకవేళ ఈ ఏడాది టీ-20 వరల్డ్​కప్​ను వాయిదా వేస్తే, 2021లో తిరిగి ఆసీస్​లోనే నిర్వహించే అవకాశాన్ని ఐసీసీ పరిశీలించాలని తెలిపాడు.

"ఈ ఏడాది ఐపీఎల్​ జరగాలని అనుకుంటున్నా. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా సంయుక్తంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్​కు ఆతిథ్యం ఇస్తే బాగుంటుంది. ఇక భారత్​లో జరగాల్సిన వరల్డ్​ కప్​ను 2022కి వాయిదా వేసే అవకాశం ఉంది." అని వెల్లడించాడు.

Exclusive: Monty Panesar feels IPL should replace men's T20 World Cup in OCT-NOV
ఎంఎస్​ ధోనీ

ఆ విషయం ధోనికి తెలుసు..

టీ20 ప్రపంచ కప్​ వాయిదా వేయడం వల్ల భారత మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడని మాంటీ​ అన్నాడు. వచ్చే ఐపీఎల్​లో ధోనీ బాగా రాణిస్తే.. ఆటలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా, ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్​ ప్రకటించాలో అతనికే తెలుసని వివరించాడు.

మాంటి పారెసన్​

టెస్టుల్లో స్మిత్​.. టీ20, వన్డేల్లో కోహ్లీ

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఆసీస్​ క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ల బ్యాటింగ్​ ప్రదర్శన గురించి స్పందించిన మాంటీ... టెస్టుల్లో స్టీవ్​ స్మిత్​ మంచి బ్యాట్స్​మన్​ అని, ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్​ కోహ్లీ మెరుగైన ఆటగాడని ప్రశంసించాడు.

ఇదీ చూడండి:మూడు నెలల తర్వాత మైదానంలో ఇషాంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.