ప్రపంచకప్ ముందు ఇంగ్లండ్‌ను కాస్త కలవరపరిచే అంశం. ఆ జట్టు కెప్టెన్ మోర్గాన్‌కు గాయమైంది. శుక్రవారం ఉదయం ప్రాక్టీసు చేస్తుండగా అతడి చేతి వేలికి గాయమైందని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. శనివారం ఆస్ట్రేలియాతో ఆ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైందని, ప్రాక్టీస్ అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లామని ఓ అధికారి తెలిపారు.
ముందస్తు చర్యల్లో భాగంగా చేతివేలికి ఎక్స్‌రే తీయిస్తున్నామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో నిలిచిన ఇంగ్లండ్.. ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఈ జట్టులో మోర్గాన్ కీలక ఆటగాడు. మే 30న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది ఇంగ్లండ్ జట్టు.