ETV Bharat / sports

భారత్​-ఇంగ్లాండ్​ సిరీస్​.. టాప్​-3లో ఎవరు బెస్ట్​? - England's weak link is the top three as India cement theirs

మరో వారం రోజుల్లో ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల టాప్​-3 బ్యాట్స్​మెన్​ బలాలు, బలహీనతలు ఏంటనేది ఓ సారి పరిశీలిద్దాం.

England's weak link is the top three as India cement theirs
టాప్​-3 ఆర్డర్​లో ఇండియానే బెస్ట్..!​
author img

By

Published : Jan 29, 2021, 11:27 AM IST

భారత్​, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​ ఫిబ్రవరి తొలివారంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో టెస్ట్​ సిరీస్​ గెలిచి టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తోంది. అటు ఇంగ్లాండ్​ జట్టు కూడా శ్రీలంకపై విజయంతో మంచి ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల టాప్​ ఆర్డర్ బలాబలాలు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.

ఆస్ట్రేలియాతో సిరీస్​లో రోహిత్​ శర్మ, శుభ్​మన్​ గిల్​లు ఓపెనర్లుగా సఫలమయ్యారు. నంబర్​ 3లో ఇక ఛెతేశ్వర్​ పుజారా ఉండనే ఉన్నాడు. ఇక ప్రత్యర్థి జట్టు విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్​లో ఓపెనర్లు జాక్​ క్రావ్లే, డొమినిక్​ సిబ్లీలు చెప్పుకోదగ్గ ఆరంభాలు ఇవ్వలేదు. సిబ్లీ ఒకే ఒక అర్ధ శతకం చేశాడు.

ఇక మూడో నంబర్​లో వన్​డౌన్​లో బ్యాటింగ్​కు దిగే జానీ బెయిర్​ స్టో 46.33 సగటుతో ఫర్వాలేదనిపించినా.. ఆటగాళ్ల రొటేషన్​లో భాగంగా భారత్​తో తొలి రెండు టెస్టులకు అతన్ని ఎంపిక చేయలేదు ఇంగ్లాండ్​ బోర్డు. ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా ఆ దేశ మాజీ కెప్టెన్​ నాసర్​ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు.

"బెయిర్​ స్టో, బెన్​ స్టోక్స్, జో రూట్​లు స్పిన్​ బౌలింగ్​ను సమర్థంగా ఎదుర్కొంటారు. అలాంటిది ప్రస్తుత సిరీస్​కు బెయిర్​ స్టోను స్వదేశానికి పంపించే విషయాన్ని మరోసారి ఆలోచించాలి" అని నాసర్​ పేర్కొన్నాడు.

బెయిర్​ స్టోతో ఖాళీ అయిన 3వ స్థానాన్ని క్రావ్లీతో ఆడించే యోచనలో ఉంది ఇంగ్లాండ్​ జట్టు. శ్రీలంకతో సిరీస్​కు అందుబాటులో లేని రెగ్యులర్​ ఓపెనర్​ రోరీ బర్న్స్​ .. సిబ్లీతో జతకట్టనున్నాడు.

శ్రీలంకతో సిరీస్​కు ముందు క్రావ్లీ వన్​డౌన్​లో ఆడిన అనుభవం ఉంది. ఓ డబుల్​ సెంచరీ కూడా చేశాడు. కానీ, స్పిన్నర్లపై ఆడటంలో క్రావ్లీ బ్యాటింగ్​లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని నాసర్ అతని వైఫల్యాలను ఎత్తి చూపాడు.

అంతేకాక, ఈ ముగ్గురు ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్లకు ఒక్క శ్రీలంకలో తప్ప ఉపఖండ పరిస్థితుల్లో ఆడిన అనుభవం లేదు. చివరిసారిగా 2018లో అక్కడ పర్యటించినప్పుడు.. ​క్రావ్లీ ఆరు ఇన్నింగ్స్​ల్లో కలిపి 25.83 సగటుతో 155 పరుగులు మాత్రమే చేశాడు. బర్న్స్​, క్రావ్లీ, సిబ్లీలు ముగ్గురు కలిసి 45 టెస్టుల్లో ఆడిన అనుభవం ఉంది. వాటిలో 7 టెస్టులు మాత్రమే ఉపఖండ పిచ్​లపై(అన్ని శ్రీలంకలోనే) ఆడారు.

అదే భారత్​ టాప్​ ఆర్డర్​ను తీసుకుంటే.. రోహిత్​, పుజారాలు 115 టెస్టుల్లో ఆడిన అనుభవం వారి సొంతం. ఇందులో 55 టెస్టులు స్వదేశంలో.. 8 మ్యాచ్​లు శ్రీలంక, బంగ్లాలపై ఆడినవే. ఒక్క గిల్​ మాత్రమే ఇటీవల ఆస్ట్రేలియాతో అరంగ్రేటం చేశాడు. అతనికి కూడా దేశవాళీ మ్యాచ్​ల్లో ఆడిన అనుభవం ఉండనే ఉంది.

ఇదీ చదవండి: భారత్​- ఇంగ్లాండ్​ సిరీస్​కు టీవీ రైట్స్​ ఎప్పుడో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.