ఇటీవలే పాకిస్థాన్ సూపర్‌లీగ్‌లో కరోనా సోకిన ఇద్దరు విదేశీ ఆటగాళ్లలో తానొకడినని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ టామ్ బాంటన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తనను ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపాడు. ఈ లీగ్‌లో తాను ఆడుతోన్న క్వాట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీ ఐసోలేషన్‌లో తనపై పత్యేక చొరవ చూపిస్తున్నట్లు తెలిపాడు.
- — Tom Banton (@TBanton18) March 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Tom Banton (@TBanton18) March 3, 2021
">— Tom Banton (@TBanton18) March 3, 2021
అయితే, బాంటన్‌కు రాబోయే రోజుల్లో జరిపే కొవిడ్ టెస్ట్‌ల్లో మూడు సార్లు నెగెటివ్ వచ్చిన తర్వాత అతడిని బయోబబుల్‌లోకి అనుమతిస్తారు.
ప్రస్తుతం జరుగుతోన్న పీఎస్ఎల్లో మంగళవారం ముగ్గురికి కరోనా సోకినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అందులో ఇద్దరు విదేశీ క్రికెటర్లతో పాటు ఒక సహాయక సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. అంతకు ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఫవాద్ అహ్మద్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ క్రికెటర్లకు డయేరియా.. కానీ!