ETV Bharat / sports

చివరి టెస్టు, విజ్డెన్ ట్రోఫీ ఇంగ్లాండ్​దే - England vs west indies match

వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఇంగ్లాండ్ జట్టు. చివరి టెస్టులో 269 పరుగుల తేడాతో గెలిచి విజ్డెన్ ట్రోఫీ దక్కించుకుంది.

చివరి టెస్టు, విజ్డెన్ ట్రోఫీ ఇంగ్లాండ్​దే

author img

By

Published : Jul 28, 2020, 9:54 PM IST

కరోనా కారణంగా కొద్ది నెలలుగా క్రికెట్​కు విరామం లభించింది. ఈ మధ్యే ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సిరీస్​ దిగ్విజయంగా పూర్తయింది. మూడు మ్యాచ్​ల సిరీస్​ను ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితంగా విజ్డెన్ ట్రోఫీ ఇంగ్లాండ్​కు దక్కింది.

చివరిదైన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 390 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 129 పరుగులకే ఆలౌటైంది.. ఫలితంగా 269 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ భారీ విజయం దక్కించుకుంది. క్రిస్ వోక్స్ 5, స్టువర్ట్ బ్రాడ్ 4 వికెట్లతో రాణించారు. తొలి ఇన్నింగ్స్​లో 6 వికెట్లు తీసిన బ్రాడ్ ఈ మ్యాచ్​లో మొత్తం 10 వికెట్లు సాధించాడు. ఈ ఘనత సాధించడం ఇతడికిది మూడోసారి. తద్వారా మ్యాన్ ఆఫ్ ద సిరీస్​గానూ ఎంపికయ్యాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 369 పరుగులు చేసింది. వెస్టిండీస్ మాత్రం 197 పరుగులకే పరిమితమైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లీష్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తర్వాత 390 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు 129 పరుగులకు ఆలౌటైంది.

మొదటి టెస్టులో విండీస్‌ అద్భుతమైన విజయం సాధించి ఇంగ్లాండ్​కు షాకిచ్చింది. అయితే రెండో టెస్టులో ఫుంజుకున్న ఆతిథ్య జట్టు కరీబియన్ జట్టుపై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్టులో గెలిచి ట్రోఫీని దక్కించుకుంది ఇంగ్లాండ్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.