ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో మరో ఉత్కంఠభరిత విజయం. ఆఖరి వరకు సాగిన పోరులో ఈ సారి ఇంగ్లాండ్‌పై చేయి సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య సఫారీలపై రెండు పరుగుల తేడాతో గెలిచింది ఇంగ్లీష్ సేన. ఫలితంగా సిరీస్ 1-1తో సమమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (40), బెయిర్ స్టో(35), మొయిన్ అలీ (39), బెన్ స్టోక్స్ (47*) మెరిశారు. సఫారీ బౌలర్లలో ఎంగిడీ మూడు వికెట్లు తీశాడు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 202 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. సఫారీలు 12 పరుగులే చేశారు. అయితే ప్రిటోరియస్ (25) ఆఖరి ఓవర్లో ఫోర్, సిక్సర్ బాదడం వల్ల విజయ సమీకరణం 2 బంతుల్లో నాలుగు పరుగులుగా మారింది. కానీ టామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేసి చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో డికాక్ (65), డసెన్ (43) గొప్పగా పోరాడారు.
తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం జరగనుంది.
ఇదీ చదవండి: శతకంతో ఆదుకున్న విహారీ.. భారత్ 263 ఆలౌట్