ETV Bharat / sports

నేటి నుంచే ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ తొలి టెస్టు - cricket match latest news updates

లాక్​డౌన్​ కారణంగా మూడు నెలలకుపైగా వాయిదా పడ్డ క్రీడా కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే పునఃప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే వేయి కళ్లతో ఎదురు చూస్తున్న క్రికెట్​ అభిమానుల కోసం ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ టెస్టు సిరీస్​ రానే వచ్చింది. బుధవారం మొదలవ్వనున్న తొలి టెస్టులో.. కరోనా సోకకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ మ్యాచ్​తోనే భవిషత్తులో ఆటలను కొనసాగించడంపై ఓ స్పష్టత వస్తుందని క్రీడా ప్రపంచం భావిస్తోంది.

England - West Indies first Test from today
ఇంగ్లాండ్‌-వెస్టిండీస్
author img

By

Published : Jul 8, 2020, 7:24 AM IST

నాలుగు నెలలకు పైగా ఆడేవాళ్లు లేక.. చూసేవాళ్లు కరువై మైదానాలు బోసిపోయాయి. ఆటగాళ్లు ఇళ్లకు పరిమితం అవ్వడం వల్ల.. క్రీడా ఛానెళ్లన్నీ హైలైట్లతో నడిపించేస్తున్నాయి.. 'లైవ్‌' ఊసే లేదు! ఇక ఇప్పుడిప్పుడే క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూసే అవకాశం లేదు అనుకుంటుండగా.. క్రికెట్‌ అభిమానుల కోసం మేమున్నామంటూ ధైర్యంగా ముందుకొచ్చాయి ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లు. కరోనా మహమ్మారిని ఎదిరించి.. టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాయి. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారమే తొలి టెస్టు ఆరంభం. కరోనా దరి చేరకుండా కట్టుదిట్టమైన 'బయో సెక్యూర్‌' విధానంలో నిర్వహించబోతున్న ఈ టెస్టు మ్యాచ్‌ దిగ్విజయంగా పూర్తయి.. క్రికెట్​ మాత్రమే కాక అన్ని ఆటలకూ మార్గ నిర్దేశం చేస్తుందని క్రీడా ప్రపంచం ఎదురు చూస్తోంది.

England - West Indies first Test from today
ఇంగ్లాండ్‌-వెస్టిండీస్

సౌథాంప్టన్‌

117 రోజుల విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ చూడబోతున్నాం. కరోనా వల్ల ఆగిన క్రికెట్‌ మళ్లీ పునఃప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ బుధవారమే మొదలవుతుంది. వైరస్‌ ముప్పు నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బయో సెక్యూర్‌ విధానంలో నిర్వహిస్తోంది ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్‌ అధికారులు, ఇతర సిబ్బంది, పనివాళ్లతో సహా గత నెలలోనే 'బుడగ'లోకి వెళ్లారు. బయటి ప్రపంచంలో సంబంధాలు కోల్పోయారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలాక వీళ్లందరూ క్వారంటైన్‌ అయ్యారు. వారున్న పరిసరాల్లోకి బయటి వాళ్లెవ్వరూ వెళ్లరు. ఆటగాళ్లతో సహా అందరికీ మ్యాచ్‌ ముంగిట మరోసారి పరీక్షలు నిర్వహించి కరోనా లేదని తేలాకే వీళ్లందరినీ మ్యాచ్‌లో భాగం చేస్తున్నారు. సిరీస్‌ ముగిసేవరకు ఇంతే. బయటి వాళ్లెవ్వరితోనూ సంబంధాలు లేవు కాబట్టి వీళ్లెవ్వరికీ కరోనా సోకే ప్రమాదం లేనట్లే. మ్యాచ్‌ ముంగిట అయితే ఎలాంటి అపశ్రుతులూ చోటు చేసుకోలేదు. ఇలాగే సిరీస్‌ ముగిసే వరకు అంతా సజావుగా సాగితే గొప్ప విజయం సాధించినట్లే. తర్వాత మిగతా సిరీస్‌లనూ ఇదే పద్ధతిలో నిర్వహించడానికి బోర్డులు ముందుకొస్తాయి. ఇతర క్రీడలూ క్రికెట్‌ను అనుసరించే అవకాశముంది. అందుకే ఈ సిరీస్‌ మీద క్రీడా ప్రపంచమంతా దృష్టిసారించింది.

ఇంగ్లాండ్‌దే పైచేయి కానీ..

సొంతగడ్డపై అన్ని జట్లలాగే ఇంగ్లాండ్‌ బలమైన జట్టు. అయితే వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు కెప్టెన్‌ జో రూట్‌ దూరం కావడం ఆ జట్టుకు ఎదురు దెబ్బే. అయినప్పటికీ తాత్కాలిక కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ నేతృత్వంలో కదం తొక్కాలని చూస్తోంది. రూట్‌ దూరం కావడం వల్ల ఇంగ్లాండ్‌ టాప్‌ఆర్డర్‌లో అనుభవజ్ఞుడు లేని లోటు కనిపిస్తోంది. బర్న్స్‌, సిబ్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా.. డెన్లీ, క్రాలీ వారిని అనుసరిస్తారు. స్టోక్స్‌, బట్లర్‌లతో మిడిలార్డర్‌ మాత్రం బలంగా కనిపిస్తోంది. అండర్సన్‌, ఆర్చర్‌, బ్రాడ్‌లతో పేస్‌ విభాగానికి తిరుగులేదు. ఇక గత ఏడాది తమ సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన విండీస్‌.. దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగనుంది. బ్రాత్‌వైట్‌, షై హోప్‌, హోల్డర్‌, రోచ్‌, గాబ్రియెల్‌ లాంటి అనుభవజ్ఞులపై ఆ జట్టు భారం వేసింది. రోచ్‌, గాబ్రియల్‌లకు తోడు యువ కెరటం అల్జారి జోసెఫ్‌తో విండీస్‌ పేస్‌ విభాగం బలంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌ పేస్‌ బౌలర్లను విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ మేర నిలువరిస్తారన్న దానిపై మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంటుంది.

ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌

ఉమ్ము లేదు.. స్వింగ్‌ ఎలా?

బంతికి ఉమ్ము రాసి స్వింగ్‌కు అనుకూలంగా మార్చడం దశాబ్దాలుగా చూస్తున్న విషయం. కానీ ఇప్పుడు అందుకు అవకాశం లేదు. కరోనా ముప్పు నేపథ్యంలో బంతికి ఉమ్ము రాయడాన్ని నిషేధించింది ఐసీసీ. ప్రత్యామ్నాయ ఏర్పాటేదో చేస్తారని వార్తలొచ్చాయి కానీ.. అలాంటిదేమీ జరగలేదు. మరిప్పుడు.. ఫాస్ట్‌బౌలర్లు స్వింగ్‌ కోసం ఏం చేస్తారో చూడాలి. ఇంగ్లాండ్‌ వాతావరణంలో ఆటగాళ్లకు చెమట పట్టే అవకాశం లేదు. కాబట్టి దాన్నీ బంతి మెరుపు కోసం ఉపయోగించలేరు. మరి స్వింగ్‌కు పేరుపడ్డ అండర్సన్‌ లాంటి బౌలర్లు ఎలా బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసురుతారో చూడాలి. బ్యాటు, బంతి మధ్య సమతూకం కనిపించకుంటే ఉమ్ముకు ప్రత్యామ్నాయాల కోసం డిమాండ్లు పెరగొచ్చు.

* రెండు మధ్య జరిగిన గత అయిదు టెస్టుల్లో వెస్టిండీస్‌ మూడు మ్యాచ్‌లు గెలవగా.. ఇంగ్లాండ్‌ రెండు నెగ్గింది. చివరగా గత ఏడాది రెండు జట్ల మధ్య వెస్టిండీస్‌లో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కరీబియన్‌ జట్టు 2-0తో చేజిక్కించుకుని సంచలనం సృష్టించింది.

పిచ్‌, వాతావరణం

ఇంగ్లాండ్‌లో వాతావరణం ఇటీవల చల్లబడింది. వర్షాలు కురుస్తున్నాయి. తొలి టెస్టు సందర్భంగా అప్పుడప్పుడూ వరుణుడు పలకరించే అవకాశాలున్నాయి. జల్లులు పడొచ్చు. భారీ వర్ష సూచనలైతే లేవు. సౌథాంప్టన్‌ పిచ్‌ సాధారణంగా పేసర్లకు సహకరిస్తుంది. ఈ మ్యాచ్‌లోనూ భిన్నంగా ఉండకపోవచ్చని అంచనా. బంతికి ఉమ్ము రాయడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో పేసర్లకు మరింత సహకారం అందేలా పిచ్‌పై మరింత ఎక్కువ పచ్చికను ఉంచే అవకాశముంది.

* మ్యాచ్‌లో రెండు జట్లూ నల్లజాతీయులపై జాత్యహంకారానికి వ్యతిరేకంగా ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అనే నినాదంతో ఉన్న బ్యాడ్జీలను ధరిస్తారు.

* ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన స్థానిక అంపైర్లే విధులు నిర్వర్తించనున్నారు. వేరే దేశాల అంపైర్లతో ప్రయాణం చేయించి ఇంగ్లాండ్‌కు తీసుకురావడం ఇబ్బందన్న ఉద్దేశంతో ఇందుకు ఐసీసీ అనుమతించింది. ఈ మ్యాచ్‌కు సమీక్షల సంఖ్యను రెండు నుంచి మూడుకు పెంచారు.

* మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి మొదలవుతుంది. సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

తుది జట్లు (అంచనా)

* ఇంగ్లాండ్‌: రోరీ బర్న్స్‌, డామ్‌ సిబ్లీ, జో డెన్లీ, జాక్‌ క్రాలీ, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), ఓలీ పోప్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌కీపర్‌), డామ్‌ బెస్‌, జోఫ్రా ఆర్చర్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌.

* వెస్టిండీస్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, బ్రూక్స్‌, షై హోప్‌, రోస్టన్‌ చేజ్‌, డౌరిచ్‌ (వికెట్‌కీపర్‌), హోల్డర్‌ (కెప్టెన్‌), గాబ్రియెల్‌, కార్న్‌వాల్‌, అల్జారి జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.