ETV Bharat / sports

డ్రాతో గట్టెక్కిన పాక్​... 1-0తో సిరీస్​ ఇంగ్లాండ్​దే

ఇంగ్లాండ్​-పాక్ మధ్య జరిగిన మూడో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఫలితంగా 1-0తో సిరీస్​ కైసవం చేసుకుంది ఇంగ్లీష్​​ జట్టు. ఈ మ్యాచ్​లోనే 600వ టెస్టు వికెట్​ తీసి రికార్డు నెలకొల్పాడు అండర్సన్.

ENG vs PAK
ఇంగ్లాండ్​Xపాక్ టెస్టు సిరీస్​
author img

By

Published : Aug 26, 2020, 6:40 AM IST

వరుణుడి పుణ్యమా అని పాకిస్థాన్‌ బతికిపోయింది. ఇంగ్లాండ్‌తో చివరిదైన మూడో టెస్టును డ్రాగా ముగించింది. వర్షం వల్ల నాలుగో రోజు 56 ఓవర్ల ఆటే సాధ్యం కాగా.. అయిదో రోజు మరింత ఆట వృథా అయింది. వాన కారణంగా తొలి రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోవడం పాకిస్థాన్‌కు కలిసొచ్చింది. లేదంటే.. ఫాలో ఆన్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 100/2తో మంగళవారం బరిలోకి దిగిన పాక్‌కు రోజంతా ఇంగ్లాండ్‌ బౌలర్లను ఎదుర్కొని మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టమయ్యేది. ఆట ఆఖరుకు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. బాబర్‌ అజామ్‌ 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితం తేలే అవకాశం లేకపోవడం వల్ల రెండు జట్లు కాస్త ముందుగానే డ్రాకు అంగీకరించాయి.

శుక్రవారం నుంచి టీ20

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 583/8 వద్ద డిక్లేర్‌ చేయగా.. పాకిస్థాన్‌ 273 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్‌ టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకోవడం ఆఖరి రోజు ఆటలో విశేషం. సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 1-0తో గెలుచుకుంది. ఇంగ్లాండ్‌ తొలి టెస్టులో నెగ్గగా.. వర్షం వెంటాడడం వల్ల రెండో టెస్టు డ్రా అయింది. ఈ రెండు జట్ల మూడు మ్యాచ్‌ల టీ20 ఈ సిరీస్‌ శుక్రవారం ఆరంభమవుతుంది.

ENG vs PAK
63 పరుగులతో అజేయంగా నిలిచిన బాబర్​

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌:

583/8 డిక్లేర్డ్‌; పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 273; పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌: షాన్‌ మసూద్‌ ఎల్బీ (బి) బ్రాడ్‌ 18; అబిద్‌ అలీ ఎల్బీ (బి) అండర్సన్‌ 42; అజహర్‌ అలీ (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 31; బాబర్‌ అజామ్‌ 63 నాటౌట్‌; షఫిక్‌ (సి) బ్రాసే (బి) రూట్‌ 21; అలమ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (83.1 ఓవర్లలో) 187/4; వికెట్ల పతనం: 1-49, 2-88, 3-109, 4-172; బౌలింగ్‌: అండర్సన్‌ 19-3-45-2; బ్రాడ్‌ 14.1-5-27-1; వోక్స్‌ 8-2-14-0; ఆర్చర్‌ 14-8-14-0; బెస్‌ 21-4-54-0; రూట్‌ 6-0-17-1; సిబ్లే 1-0-7-0.

ENG vs PAK
జేమ్స్​ అండర్సన్​

ప్రశాంత విధ్వంసకుడు

లైన్‌ అండ్‌ లెంగ్త్‌.. స్వింగ్‌.. ఈ రెంటిని నమ్ముకుని క్రమశిక్షణతో బౌలింగ్‌ చేస్తూ వికెట్ల పంట పండించుకునే బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌. వసీమ్‌ అక్రమ్‌ తర్వాత ప్రపంచ క్రికెట్​లో స్వింగ్‌ అనగానే గుర్తొచ్చే ఫాస్ట్‌బౌలర్‌ అతనే. అక్రమ్‌ అంత వేగం, వైవిధ్యం లేకపోయినా.. అతనంత గొప్ప పేరూ తెచ్చుకోకపోయినా.. ఇప్పుడు అక్రమ్‌ కూడా అందుకోలేని 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో మురళీధరన్‌ (800), వార్న్‌ (708), కుంబ్లే (619) మాత్రమే అతడి కంటే ఎక్కువ వికెట్లు తీశారు. కానీ ఆ ముగ్గురూ స్పిన్నర్లు. వాళ్లకుండే సానుకూలతలు వేరు. వాళ్లలా ఫాస్ట్‌బౌలర్లు సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగలేరు. మ్యాచ్‌లో ఎక్కువ ఓవర్లు వేయలేరు. వాళ్లు పడే కష్టం, ఎదుర్కొనే ఒత్తిడి అసాధారణమైంది. అయినా సరే.. స్పిన్నర్‌ అయిన మురళీధరన్‌ కంటే 600 వికెట్ల ఘనతకు కేవలం ఆరు బంతులు మాత్రమే ఎక్కువ తీసుకున్నాడు అండర్సన్‌. 2003లో జింబాబ్వేపై ఆడిన అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే అయిదు వికెట్ల ప్రదర్శనతో అండర్సన్‌ ప్రస్థానం మొదలైంది. అతను ఏకంగా 17 ఏళ్ల పాటు టెస్టు క్రికెట్లో కొనసాగుతాడని, 600 వికెట్ల మైలురాయిని అందుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు.

ENG vs PAK
అండర్సన్​

ప్రియమైన భారత్‌:

అండర్సన్‌ అత్యధిక వికెట్లు తీసింది భారత్‌పైనే. 27 మ్యాచ్‌లు ఆడి 25.98 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాపైనా అతను వికెట్ల సెంచరీ (104) సాధించాడు. అండర్సన్‌ ఉండగా భారత జట్టు ఎప్పుడు ఇంగ్లిష్‌ పర్యటనకు వెళ్లినా.. మన బ్యాట్స్‌మెన్‌కు తలనొప్పి తప్పలేదు. కోహ్లి లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా తన స్వింగ్‌తో ఏడిపించిన బౌలర్‌ అతను.

అదే బలం.. బలహీనత:

చాలామంది దిగ్గజ ఫాస్ట్‌బౌలర్లతో పోలిస్తే అండర్సన్‌కు అంత గొప్ప పేరు రాకపోవడానికి కారణం.. స్వదేశీ పరిస్థితుల్లోనే ఎక్కువ రాణించడం. 600లో 391 వికెట్లు సొంతగడ్డపైనే తీశాడు అండర్సన్‌. స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో అండర్సన్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా సవాలే. వేరే దేశాల్లో, ముఖ్యంగా ఉపఖండంలో జేమ్స్‌ సాధారణంగా కనిపిస్తాడు. అయినప్పటికీ.. ఒక ఎంతో శ్రమ, ఒత్తిడితో కూడిన ఫాస్ట్‌బౌలర్‌ కెరీర్‌ 17 ఏళ్లు కొనసాగడం, ఇప్పటికీ ప్రధాన బౌలర్‌గా ఉంటూ జట్టుకు విజయాలందిస్తుండటం, 600 వికెట్ల మైలురాయిని అందుకోవడం మామూలు విషయం కాదు.

ఎక్కడ ఎన్ని?

  • స్వదేశంలో 391
  • విదేశాల్లో 209

600 వికెట్ల క్లబ్‌లో వీళ్లే

  • మురళీధరన్‌ 800
  • వార్న్‌ 708

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.