ETV Bharat / sports

మలన్-బట్లర్ రికార్డు- ఇంగ్లాండ్​దే టీ20 సిరీస్​ - ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్

ఇంగ్లాండ్​ తరఫున రికార్డు భాగస్వామ్యం నమోదు చేసిన మలన్-బట్లర్.. మూడో టీ20ని సులభంగా గెలిపించారు. దీంతో 3-0 తేడాతో సిరీస్​ మోర్గాన్ ​సేన వశమైంది.

England romps to 3-0 T20 series win over South Africa
ఇంగ్లాండ్ జట్టు
author img

By

Published : Dec 2, 2020, 10:52 AM IST

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​ను ఇంగ్లాండ్ క్లీన్​స్వీప్ చేసింది. కేప్​టౌన్​ వేదికగా జరిగిన మూడో మ్యాచ్​ను 9 వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. సఫారీలు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే పూర్తి చేసింది. డేవిడ్ మలన్(99 నాటౌట్), జాస్ బట్లర్(67 నాటౌట్) విజయంలో కీలకపాత్ర పోషించారు.

malan jos buttler
డేవిడ్ మలన్-జాస్ బట్లర్

భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. డికాక్(17), బవుమా(32), హెండ్రిక్స్(13), డుప్లెసిస్(52 నాటౌట్), వాండర్​సెన్(74 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో స్టోక్స్ 2, జోర్డాన్ 1 వికెట్ తీశారు.

ఛేదనలో ఇంగ్లాండ్​ తొలి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు జేసన్ రాయ్ 16 పరుగులు చేసి ఔటవ్వగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన మలన్.. బట్లర్​తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరూ 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, మ్యాచ్​ను గెలిపించారు.

England romps to 3-0 T20 series win over South Africa
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్​ ఫలితం

టీ20ల్లో ఇంగ్లాండ్​కు ఏ వికెట్​కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. మొత్తం ఈ ఫార్మాట్​లో ఎనిమిదో అత్యధిక భాగస్వామ్యం.

ఈ సిరీస్‌ విజయంతో ఇంగ్లాండ్‌ (275) తమ రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (275), భారత్ (266), పాకిస్థాన్‌ (262), దక్షిణాఫ్రికా (252) ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.