శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఒక ఆటగాడికి యూకే కరోనా స్ట్రెయిన్ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అతడిని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించామని చెప్పారు.
తొలి స్ట్రెయిన్ కేసు
తొలుత ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీకి పాజిటివ్‌గా తేలిందని, అది యూకే స్ట్రెయిన్‌గా గుర్తించామని లంక వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయితే, శ్రీలంకలో ఇదే తొలి యూకే స్ట్రెయిన్ కేసు అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందన్న నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నామన్నారు.
యథావిధిగా సిరీస్
అంతకుముందు మిగతా ఆటగాళ్లకు నెగెటివ్ రావడం వల్ల గురువారం నుంచి టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతందని చెప్పారు. మరోవైపు అలీతో సన్నిహితంగా ఉన్న క్రిస్‌వోక్స్‌కు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే, వోక్స్ తొలి టెస్టులో ఆడడం సందేహంగా ఉంది.
ఇంగ్లాండ్, శ్రీలంకల మధ్య జరగాల్సిన రెండు టెస్టుల సిరీస్ నేటి (గురువారం) నుంచి ప్రారంభమైంది. లాక్డౌన్ కన్నా ముందే ఈ సిరీస్ జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. క్రికెట్ మళ్లీ మొదలయ్యాక సిరీస్‌ను నిర్వహించడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఈ క్రమంలోనే జనవరి 4న అక్కడ అడుగుపెట్టిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేశారు.
ఇదీ చూడండి: శ్రీలంకతో టెస్టు.. ఇంగ్లాండ్ జట్టులో కరోనా కలవరం!