సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చింది ఇంగ్లాండ్ జట్టు. చెన్నైలోని విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న ఆటగాళ్లకు బీసీసీఐ స్వాగతం పలికింది. వీరితోపాటు కొంతమంది భారత ప్లేయర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా కొవిడ్ టెస్టు పూర్తవ్వగానే వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్ భారత్కు వచ్చి క్వారంటైన్లోకి కూడా వెళ్లిపోయారు.
ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండేందుకు చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో బయోబబుల్ను ఏర్పాటు చేసింది బీసీసీఐ.

షెడ్యూల్ ఇదే..
భారత పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.
