కరోనా తర్వాత క్రికెట్ పుంజుకుంటోంది. వరుస టోర్నీలతో అన్ని దేశాల ఆటగాళ్లు బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్.. మరో రసవత్తర పోరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్వదేశంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు ఓకే చెప్పింది ఇంగ్లీష్ బోర్డు. వచ్చే ఏడాది జూన్‌లోనే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగే అవకాశం ఉంది. అందుకే ఇరు దేశాల మధ్య ఈ మ్యాచ్‌లు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకంగా ఉండనున్నాయి.
అభిమానుల సమక్షంలోనే...
కరోనా నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది నుంచి అభిమానుల మధ్యే మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్. జనవరి 12 నుంచి టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. మ్యాచ్‌లు రద్దయినా, కరోనా కారణంగా వేదిక మారినా డబ్బులు వాపస్ చేస్తామని స్పష్టం చేశారు.
షెడ్యూల్ ఇదే..
మ్యాచ్ | తేదీలు | వేదిక |
తొలి టెస్టు | ఆగస్టు 4-8 | ట్రెంట్ బ్రిడ్జ్ |
రెండో టెస్టు | ఆగస్టు 12-16 | లార్డ్స్ |
మూడో టెస్టు | ఆగస్టు 25-29 | ఎమరాల్డ్ హడ్డింగ్లే |
నాలుగో టెస్టు | సెప్టెంబర్ 2-6 | కియా ఓవల్ |
ఐదో టెస్టు | సెప్టెంబర్ 10-14 | ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ |