దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు విచిత్రమైన సమస్య ఎదురైంది. దాదాపు సగం మంది క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెంచూరియన్‌లో ఇరుజట్లు తొలి టెస్టు ఆడుతున్నాయి. మూడో రోజైన శనివారం ఉదయం.. ఇంగ్లీష్ జట్టు సారథి జో రూట్, కీపర్ జోస్ బట్లర్ అసౌకర్యానికి గురయ్యారు. బట్లర్ అసలు మైదానంలోకే రాకపోవడం వల్ల బెయిర్‌స్టో వికెట్ కీపింగ్ చేశాడు. రూట్ కాసేపు ఫీల్డింగ్ చేసినప్పటికీ, డ్రింక్స్ విరామం రాగానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
అస్వస్థతతో జాక్‌లీచ్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్.. హోటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వారికి తోడుగా ఇద్దరు సహాయ సిబ్బంది ఉన్నారు. మరో క్రికెటర్ ఒలివ్ పాప్ ఆరోగ్యం మెరుగైంది. సాధనకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఆర్చర్ ఐదు వికెట్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రూట్.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. డికాక్ (95) ఆదుకోవడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేశారు సఫారీలు. అనంతరం ఫిలాండర్ 4, రబాడ 3 వికెట్లతో విజృంభించడం వల్ల ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది.
అయితే సఫారీలను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. 5 వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా 272 పరుగులకే ఆలౌటైంది దక్షిణాఫ్రికా. తొలి టెస్టులో గెలవాలంటే మరో రెండ్రోజుల్లో 376 పరుగులు చేయాలి ఇంగ్లాండ్.
-
End of innings | SA: 272 all out
— Cricket South Africa (@OfficialCSA) December 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
All good things come to an end.
Philander is the last batter out for 46.
Earlier van der Dussen struck a maiden half-ton to propel the Proteas' batting charge.
The Proteas have set England of 376 runs to win the match.#ProteaFire #SAvENG pic.twitter.com/UDR7dumdlW
">End of innings | SA: 272 all out
— Cricket South Africa (@OfficialCSA) December 28, 2019
All good things come to an end.
Philander is the last batter out for 46.
Earlier van der Dussen struck a maiden half-ton to propel the Proteas' batting charge.
The Proteas have set England of 376 runs to win the match.#ProteaFire #SAvENG pic.twitter.com/UDR7dumdlWEnd of innings | SA: 272 all out