ETV Bharat / sports

తొలి టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం - తొలి టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం

దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఆడిన ఆస్ట్రేలియా.. మూడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ రెండు జట్ల మధ్య తర్వాత టీ20 ఆదివారం జరగనుంది.

England beat Australia by two runs to win the 1st T20I in Southampton
England beat Australia
author img

By

Published : Sep 5, 2020, 7:56 AM IST

సౌథాంప్టన్​లో తొలి టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్​లో మోర్గాన్ సేన రెండు పరుగుల తేడాతో గెల్చింది. డేవిడ్ మలన్(66).. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్ జట్టులో డేవిడ్ మలన్(66), బట్లర్(44) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్​మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రిచర్డ్​సన్, అగర్, మ్యాక్స్​వెల్ తలో రెండో వికెట్లు పడగొట్టారు.

ఛేదనను ఆస్ట్రేలియా అద్భుతంగా ప్రారంభించింది. తొలి వికెట్​కు ఓపెనర్లు ఫించ్(46)-వార్నర్(58).. 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్.. 124-2 స్కోరు ఉన్నప్పుడు 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వరుసగా వికెట్లు పడగొట్టారు ఇంగ్లాండ్ బౌలర్లు. దీంతో 6 వికెట్ల కోల్పోయి 160 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.