ETV Bharat / sports

మాంచెస్టర్​ టెస్టు సమమా.. ఫలితమా! - వెస్టిండీస్​ క్రికెట్​

మాంచెస్టర్​ వేదికగా ఇంగ్లాండ్​-వెస్టిండీస్​ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్​లో ఆధిక్యాన్ని సంపాదించిన ఆతిథ్య జట్టు చివరిరోజు ఏ విధంగా విండీస్​ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయగలుగుతుందో చూడాలి.

ENG vs WI: England lead by 219 runs
మాంచెస్టర్​ టెస్టు సమమా లేదా ఫలితమా!
author img

By

Published : Jul 20, 2020, 7:10 AM IST

ఒక రోజుకు పైగా ఆట వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోతేనేమి.. ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ రెండో టెస్టులో ఆసక్తికేమీ కొదవలేదు. మూడు టెస్టుల సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ కూడా ఉత్కంఠభరిత ముగింపు ముంగిట నిలిచింది. వెస్టిండీస్‌ను ఫాలోఆన్‌ ఉచ్చులో బిగించి ఇన్నింగ్స్‌ ఓటమికి బాటలు పరుచుకోవాలన్న ఇంగ్లాండ్‌ ఆశ నెరవేరలేదు కానీ.. సాధ్యమైనంత తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆతిథ్య జట్టు.. చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఎంత స్కోరు వద్ద డిక్లేర్‌ చేస్తుంది.. ప్రత్యర్థికి ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది.. ఇంగ్లిష్‌ బౌలర్లు జట్టును గెలిపిస్తారా.. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ తమ జట్టును రక్షించుకుంటారా అన్నది ఆసక్తికరం.

ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ రెండో టెస్టులో గెలుపు కోసం ఇంగ్లాండ్‌, ఓటమి తప్పించుకోవడానికి విండీస్‌ గట్టిగానే పోరాడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌ను 469/9 వద్ద డిక్లేర్‌ చేసిన ఇంగ్లాండ్‌.. ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఉచ్చులో బిగించడానికి ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 287 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (75; 165 బంతుల్లో 8×4), షమర్‌ బ్రూక్స్‌ (68; 137 బంతుల్లో 11×4), రోస్టన్‌ చేజ్‌ (51; 85 బంతుల్లో 7×4) పోరాడటం వల్ల విండీస్‌ ఫాలోఆన్‌ను త్రుటిలో తప్పించుకుంది. స్టువర్ట్‌ బ్రాడ్‌ (3/66), క్రిస్‌ వోక్స్‌ (3/42), సామ్‌ కరన్‌ (2/70) ఆ జట్టును కట్టడి చేశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌.. ఆట ఆఖరుకు 37/2తో నిలిచింది. వేగంగా పరుగులు రాబట్టే ఉద్దేశంతో స్టోక్స్‌ (16 బ్యాటింగ్‌), బట్లర్‌ (0) ఇన్నింగ్స్‌ను ఆరంభించడం విశేషం. అయితే రోచ్‌.. బట్లర్‌తో పాటు క్రాలీ (11)ను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశాడు. స్టోక్స్‌కు తోడుగా రూట్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ మొత్తం ఆధిక్యం 219కి చేరుకుంది. సోమవారం ఆటకు చివరి రోజు. ఇంగ్లాండ్‌ తొలి సెషన్లో వేగంగా ఆడి 300 పైచిలుకు లక్ష్యాన్ని విండీస్‌కు నిర్దేశించి విజయం కోసం ప్రయత్నించే అవకాశముంది.
చివర్లో ఉత్కంఠ..

ఉదయం 32/1తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌... 10 ఓవర్లకు పైగా వికెట్‌ కోల్పోలేదు. చాలాసేపు విసిగించిన నైట్‌వాచ్‌మన్‌ అల్జారి జోసెఫ్‌ (25) చివరికి బెస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత హోప్‌ (25) అండతో బ్రాత్‌వైట్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 112/2తో విండీస్‌ లంచ్‌కు వెళ్లింది. రెండో సెషన్‌ ఆరంభమైన కాసేపటికే హోప్‌ ఔటైనప్పటికీ.. బ్రాత్‌వైట్‌కు జత కలిసిన బ్రూక్స్‌ ఇంగ్లిష్‌ బౌలర్లకు సవాలు విసిరాడు. బ్రాత్‌వైట్‌ ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్‌ కొనసాగించడం వల్ల మరో వికెట్‌ కోల్పోకుండా 200కు చేరువైంది విండీస్‌. 199/3తో ఉన్న విండీస్‌.. ఆదివారం ఆలౌటయ్యేలా కనిపించలేదు. అయితే బ్రాత్‌వైట్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో ఔట్‌ చేసిన స్టోక్స్‌.. ఇంగ్లాండ్‌కు మళ్లీ ఆశలు కల్పించాడు.

అక్కడి నుంచి విండీస్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. బ్లాక్‌వుడ్‌ (0), డౌరిచ్‌ (0), హోల్డర్‌ (2) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. స్కోరు 260/8కు చేరుకుంది. 2 వికెట్లు చేతిలో ఉన్న విండీస్‌.. ఫాలోఆన్‌ తప్పించుకోవడానికి ఇంకా 9 పరుగులు చేయాల్సి ఉండటం వల్ల ఉత్కంఠ నెలకొంది. అయితే రోచ్‌ (5 నాటౌట్‌) అండతో చేజ్‌ ప్రమాదం తప్పించాడు. తర్వాత అతణ్ని, గాబ్రియెల్‌ (0)లను ఒకే ఓవర్లో ఔట్‌ చేసిన వోక్స్‌.. ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 469/9 డిక్లేర్డ్‌
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ (సి) అండ్‌ (బి) స్టోక్స్‌ 75; క్యాంప్‌బెల్‌ ఎల్బీ (బి) కరన్‌ 12; జోసెఫ్‌ (సి) పోప్‌ (బి) బెస్‌ 32; హోప్‌ (సి) బట్లర్‌ (బి) కరన్‌ 25; బ్రూక్స్‌ ఎల్బీ (బి) బ్రాడ్‌ 68; చేజ్‌ ఎల్బీ (బి) వోక్స్‌ 51; బ్లాక్‌వుడ్‌ (బి) బ్రాడ్‌ 0; డౌరిచ్‌ ఎల్బీ (బి) బ్రాడ్‌ 0; హోల్డర్‌ (సి) రూట్‌ (బి) వోక్స్‌ 2; రోచ్‌ నాటౌట్‌ 5; గాబ్రియెల్‌ (బి) వోక్స్‌ 0; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (99 ఓవర్లలో ఆలౌట్‌) 287
వికెట్ల పతనం: 1-16, 2-70, 3-123, 4-199, 5-242, 6-248, 7-252, 8-260; బౌలింగ్‌: బ్రాడ్‌ 23-7-66-3; వోక్స్‌ 21-10-42-3; కరన్‌ 20-4-70-2; బెస్‌ 21-3-67-1; రూట్‌ 1-1-0-0; స్టోక్స్‌ 13-3-29-1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.