ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో చివరి టెస్టులో ఓటమి దిశగా పాక్!

author img

By

Published : Aug 24, 2020, 8:24 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న చివరి టెస్టు మ్యాచ్​లో పాకిస్థాన్ ఓటమి దిశగా వెళుతోంది. ప్రస్తుతం 310 పరుగులు వెనకబడి ఉన్న పాక్ ఫాలో ఆన్ ఆడుతోంది.

ఇంగ్లాండ్​తో టెస్టులో ఓటమి అంచున పాక్!
ఇంగ్లాండ్​తో టెస్టులో ఓటమి అంచున పాక్!

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనకబడిన పాకిస్థాన్‌.. చివరి టెస్టు మీదా ఆశలు వదులుకున్నట్లే. మూడో టెస్టులో ఆ జట్టును ఇంగ్లాండ్‌ ఫాలోఆన్‌ ఉచ్చులో బిగించింది. పాక్‌ ప్రత్యర్థికి 310 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది. కెప్టెన్‌ అజహర్‌ అలీ (141 నాటౌట్‌; 272 బంతుల్లో 21x4) సెంచరీతో జట్టును ఆదుకున్నప్పటికీ, మిగతా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడం వల్ల పాక్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌటైంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా 310 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించనున్న పాక్‌.. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవడమూ అంత తేలిక కాకపోవచ్ఛు నాలుగో రోజే మ్యాచ్‌ ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు (583/8 డిక్లేర్డ్‌)కు బదులుగా ఓవర్‌నైట్‌ స్కోరు 24/3తో మూడో రోజు, ఆదివారం మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌.. ఒక దశలో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో కెప్టెన్‌ అజహర్‌ అలీ జట్టును కుప్పకూలకుండా కాపాడాడు. అతనికి తోడు రిజ్వాన్‌ (53) రాణించడం వల్ల పాక్‌ 213/5తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఫాలోఆన్‌ ప్రమాదం తప్పించుకోలేకపోయింది. అండర్సన్‌ (5/56) ఆ జట్టును దెబ్బ తీశాడు.

అంతకుముందు జాక్‌ క్రాలే (267; 393 బంతుల్లో 344, 16) కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ చేయడం వల్ల ఇంగ్లాండ్‌ 583/8 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. క్రాలేకు తోడు బట్లర్‌ (152; 311 బంతుల్లో 134, 26) శతకంతో మెరిశాడు.

క్రాలే మారథాన్‌ ఇన్నింగ్స్‌

అంతకుముందు శనివారం, రెండో రోజు ఆటలో 22 ఏళ్ల జాక్‌ క్రాలే ఆటే హైలైట్‌. ఓవర్‌నైట్‌ స్కోరు 332/4తో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ను క్రాలే (171 ఓవర్‌నైట్‌) నడిపించాడు. అతను 331 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ద్విశతకం అయిన తర్వాత గేరు మారుస్తూ ధాటిగా ఆడాడు. లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షానే లక్ష్యంగా చేసుకుంటూ పరుగులు రాబట్టాడు. 372 బంతుల్లో 250 పరుగుల మైలురాయి అందుకున్నాడు. బట్లర్‌ నుంచి అతనికి చక్కటి సహకారం అందింది.

99 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌.. ఆ తర్వాత 189 బంతుల్లో టెస్టుల్లో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బట్లర్‌తో కలిసి అయిదో వికెట్‌కు 355 పరుగులు జత చేసిన క్రాలే.. ట్రిపుల్‌ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ షఫీఖ్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడబోయిన జాక్‌.. స్టంపౌటయ్యాడు. క్రాలే (22 ఏళ్లు 201 రోజులు) ఇంగ్లాండ్‌ తరఫున డేవిడ్‌ గోవర్‌ (22 ఏళ్ల 102 రోజులు) తర్వాత డబుల్‌ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు. జాక్‌ వెనుదిరిగాక వోక్స్‌ (40)తో కలిసి బట్లర్‌ స్కోరు పెంచాడు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 583/8 డిక్లేర్డ్‌ (జాక్‌ క్రాలే 267, జాస్‌ బట్లర్‌ 152; ఫవాద్‌ ఆలమ్‌ 2/46)

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 273 (అజహర్‌ అలీ 141, రిజ్వాన్‌ 53; అండర్సన్‌ 5/56)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.