ETV Bharat / sports

మ్యాక్స్​వెల్, కారే సెంచరీలు.. వన్డే సిరీస్​ ఆసీస్​ వశం - మ్యాక్​వెల్ సెంచరీ

ఇంగ్లాండ్​తో జరిగిన మూడు వన్డేల సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. చివరి వన్డేలో 303 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి టీ20 సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది.

ENG VS AUS
వన్డే సిరీస్​ ఆసీస్​ వశం
author img

By

Published : Sep 17, 2020, 9:55 AM IST

టీ20 సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్​తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లీష్ జట్టుకు 2015 తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ ఓటమి రుచి చూపించింది. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన ఆఖరి, నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (108; 90 బంతుల్లో 4×4, 7×6), అలెక్స్‌ కారే (106; 114 బంతుల్లో 7×4, 2×6) శతకాలతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్​లో గెలిచి చూపించింది.

ఛేదనలో ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 21 వద్దే ఆరోన్ ఫించ్‌ (12) వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్‌ వార్నర్‌ (24), స్టోయినిస్‌ (4), లబుషేన్‌ (20), మిచెల్‌ మార్ష్‌ (2) వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో 73/5తో కంగారూలు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ క్రమంలోనే ఆసీస్‌ ఆపద్బాంధవుడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ క్రీజులోకి దిగాడు. అలెక్స్‌ కారేతో కలిసి సమయోచితంగా ఆడాడు. కారే నిలకడగా ఆడగా మాక్సీ మాత్రం దంచుడే పనిగా పెట్టుకున్నాడు. 48 బంతుల్లో 50, 84 బంతుల్లో శతకం బాదేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కారే ఆచితూచి ఆడుతూ శతకం బాదడం వల్ల వీరిద్దరూ ఆరో వికెట్‌ కు ‌ 212 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 285 వద్ద మాక్సీ‌, 293 వద్ద కేరీ వెనుదిరిగారు. చివర్లో కమిన్స్‌ (4*), స్టార్క్‌ (11*) అవసరమైన పరుగులు చేసి విజయం అందించారు.

బెయిర్‌స్టో శతకం వృథా

అంతకు ముందు టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ డకౌట్‌ అయినా మరో ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (112; 126 బంతుల్లో 12×4, 2×6) అద్భుత శతకం బాదేశాడు. జాస్‌ బట్లర్‌ (8), ఇయాన్‌ మోర్గాన్‌ (23) విఫలమైనా సామ్‌ బిల్లింగ్స్‌ (57; 58 బంతుల్లో 4×4, 2×6), క్రిస్‌వోక్స్‌ (53*; 39 బంతుల్లో 6×4) అర్ధశతకాలు చేయడం వల్ల 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఈ సిరీస్‌ ముగియడం వల్ల ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలోని కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం దుబాయ్‌లో అడుగుపెట్టనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.