ETV Bharat / sports

'అలా అయితే స్టోక్స్ ఆటపై తీవ్ర ప్రభావం' - 'బెన్​ స్టోక్స్​ ఆటతీరుపై ప్రభావం పడుతుందేమో!'

వీక్షకులు లేకుండా మ్యాచ్​లు జరపడం వల్ల స్టోక్స్​ లాంటి క్రికెటర్ల ప్రదర్శనపై ప్రభావం పడుతుందని అన్నాడు ఇంగ్లాండ్​ మాజీ బౌలర్​ డారెన్​ గాఫ్​.

Empty stadiums could affect Ben Stokes' performance: Darren Gough
'బెన్​ స్ట్రోక్స్​ ఆటతీరుపై ప్రభావం పడుతుందేమో!'
author img

By

Published : Jun 7, 2020, 4:36 PM IST

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్​లు జరిగితే, ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్​ స్టోక్స్​ ఆటపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ బౌలర్​ డారెన్​ గాఫ్​. కరోనా వల్ల ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్​లు నిర్వహించాలని వ్యాఖ్యలు వస్తున్న తరుణంలో ఇలా మాట్లాడాడు. ​స్టోక్స్​తో పాటు దూకుడైన ఆటగాళ్ల ప్రదర్శనపై ఈ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపాడు.

"బెన్​ స్టోక్స్​ ఆటను ఇప్పటికే చాలా మ్యాచ్​ల్లో చూశాం. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు తన పూర్తి సహకారాన్ని అందించాడు. అయితే ప్రేక్షకులు లేని స్టేడియంలో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి ఈ విషయం స్టోక్స్​పై కొంత ప్రభావం చూపుతుందని అనుకుంటున్నా"

- డారెన్​ గాఫ్​, ఇంగ్లాండ్​ మాజీ బౌలర్

"వీక్షకుల ఉన్నా, లేకున్నా కొంతమంది క్రికెటర్లకు వ్యత్యాసం తెలియదు. కానీ, కొంతమంది మాత్రం ప్రేక్షకులుంటేనే బాగా ఆడతారు" అని చెప్పాడు డారెన్​ గాఫ్.​

Empty stadiums could affect Ben Stokes' performance: Darren Gough
డారెన్​ గాఫ్​

ప్రాణాంతక కరోనా వల్ల మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలు నిలిచిపోయాయి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత, జులైలో ఇంగ్లాండ్​-వెస్టిండీస్​తో క్రికెట్ మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ టోర్నీని బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయి.

ఇదీ చూడండి... 'ఐపీఎల్​లో నాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.