తాము ఐపీఎల్ ఆతిథ్యమివ్వడానికి బీసీసీఐ అంగీకరించినట్లు అధికారికంగా పంపిన లేఖ తమకు చేరిందిని స్పష్టం చేసింది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు. ఈ విషయాన్ని సదరు బోర్డు జనరల్ సెక్రటరీ ముబాషిర్ ఉస్మాని తెలిపారు.
"మా దేశంలో ఐపీఎల్ నిర్వహణకు అంగీకరిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా పంపిన లేఖ మాకు చేరింది. నిపుణులంతా కలిసి చర్చించుకున్నాకే ఈ మెగాటోర్ని ఇక్కడ నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. లీగ్ సజావుగా సాగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం."
-ముబాషిర్ ఉస్మాని, ఎమిరేట్స్ బోర్డు జనరల్ సెక్రటరీ.
కరోనా నేపథ్యంలో విదేశీ గడ్డపై ఐపీఎల్ నిర్వహించాలని నిశ్చయించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే యూఏఈ, శ్రీలంక ముందుకొచ్చాయి. అనంతరం బోర్డు కమిటీ సభ్యుల సుదీర్ఘ చర్చల తర్వాత దుబాయ్‌లో ఈ మెగాటోర్నీ జరపాలని నిర్ణయించారు.
ఇది చూడండి జులై 30 నుంచి వన్డే ప్రపంచకప్ సూపర్‌లీగ్ ప్రారంభం