భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. మరోసారి బ్యాట్‌తో దంచికొట్టాడు. రీఎంట్రీలో దేశవాళీ లీగ్ డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడుతున్న ఇతడు.. ఇటీవలే సెంచరీ(105) చేశాడు. మళ్లీ ఈరోజు చితక్కొట్టేశాడు. సెమీస్‌లో భారత్ పెట్రోలియం కంపెనీతో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో 158 పరుగులు చేశాడు. ఇందులో 20 సిక్సర్లు, 6 ఫోర్లు ఉండటం విశేషం. ఇతడి వల్ల 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు చేసింది అతడి జట్టు.
26 ఏళ్ల పాండ్య.. వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని, ఇటీవలే కోలుకున్నాడు. ఈ మధ్యే తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. త్వరలో ఐపీఎల్ మొదలు కానుంది. అందులోనూ ఇలాంటి ఇన్నింగ్స్‌లే ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.