వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో.. ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీపై ఓ పాటను రూపొందించాడు. ఈ వీడియోను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో ధోనీని బ్రావో.. "బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్" అనే మాటలను హాస్యాస్పదంగా పలికాడు. భారత్‌లో మహీ, రాంచీలో ధోనీ, చెన్నైలో తలా అని అభిమానులు స్టేడియాల్లో ధోనీని స్మరిస్తారని ఈ పాటలో తెలియజేశాడు. ధోనీ ప్రపంచాన్ని జయిస్తాడని అందులో వెల్లడించాడు.
-
Champion @DJBravo47's next song is for 'his brudah, his brudah from anodah muddah' - @msdhoni No.7! 😍🦁💛 #AnbuDenLions #WhistlePodu pic.twitter.com/4075ewbJti
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Champion @DJBravo47's next song is for 'his brudah, his brudah from anodah muddah' - @msdhoni No.7! 😍🦁💛 #AnbuDenLions #WhistlePodu pic.twitter.com/4075ewbJti
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2020Champion @DJBravo47's next song is for 'his brudah, his brudah from anodah muddah' - @msdhoni No.7! 😍🦁💛 #AnbuDenLions #WhistlePodu pic.twitter.com/4075ewbJti
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2020
బ్రావో.. 2011 నుంచి ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సీఎస్కేకు 104 మ్యాచ్‌లు ఆడి 121 వికెట్లు సాధించాడు. రెండు సార్లు(2013,2015) పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి.. 'నాకంటే వీడియో గేమ్స్ ఎక్కువా.. మహీ'