ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై ఓడిపోయిన దక్షిణాఫ్రికా గెలుపు కోసం ఆరాటపడుతోంది. 2015 మెగాటోర్నీలో క్వార్టర్స్ వరకు చేరిన బంగ్లాదేశ్ అదే జోరును ఈ సీజన్లోనూ కొనసాగించాలనుకుంటోంది. ఈ రెండు జట్ల మధ్య నేడు లండన్ ఓవల్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచకప్ ఐదో మ్యాచ్ జరగనుంది.
సౌతాఫ్రికా సత్తాచాటుతుందా..
డుప్లెసిస్ సారథ్యంలో ప్రపంచకప్ బరిలో దిగిన ప్రొటీస్ జట్టు ఇంగ్లాండ్‌పై 104 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 207 పరుగులకే కుప్పకూలింది. తొలి మ్యాచ్‌లో పరాజయం పొందిన దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై సత్తాచాటాలని భావిస్తోంది.
లుంగి ఎంగిడి, కగిసో రబాడా, ఇమ్రాన్ తాహిర్‌లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. గత మ్యాచ్‌లో డికాక్, డస్సెన్ అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. మిగతా వారు పెద్దగా రాణించలేదు. డుప్లెసిస్ 5 పరుగులకే ఔటయ్యాడు. అతడు ఫామ్ లోకి రావాలని ప్రొటీస్ అభిమానులు ఆశిస్తున్నారు. డుమినీ, మర్కరమ్ స్థాయి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది.
ప్రపంచకప్‌లో ఇరుజట్లు ముఖాముఖీ మూడు సార్లు తలపడగా.. రెండు సార్లు ప్రొటీస్ గెలిచింది. ఒక్కసారి బంగ్లాదేశ్ విజయం సాధించింది. 2007 వరల్డ్‌కప్ టోర్నీలో 67 పరుగుల తేడాతో బంగ్లా జట్టు గెలిచింది.
బంగ్లా భయపెడుతుందా...
2007 ప్రపంచకప్‌లో భారత్‌ను, 2015 మెగాటోర్నీలో ఇంగ్లాండ్‌ను ఇంటికి పంపిన బంగ్లాదేశ్ ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టును ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాలనుకుంటోంది.
-
Snaps of Bangladesh Team today's practice session at The Oval ahead of the clash against @OfficialCSA on June 2.
— Bangladesh Cricket (@BCBtigers) May 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
https://t.co/vGQjGapqB0
https://t.co/vGQjGapqB0
">Snaps of Bangladesh Team today's practice session at The Oval ahead of the clash against @OfficialCSA on June 2.
— Bangladesh Cricket (@BCBtigers) May 31, 2019
https://t.co/vGQjGapqB0
https://t.co/vGQjGapqB0Snaps of Bangladesh Team today's practice session at The Oval ahead of the clash against @OfficialCSA on June 2.
— Bangladesh Cricket (@BCBtigers) May 31, 2019
https://t.co/vGQjGapqB0
https://t.co/vGQjGapqB0
వార్మప్ మ్యాచ్‌లో భారత్‌తో ఓడిన బంగ్లాదేశ్ ఆ తప్పులను మళ్లీ చేయకూడదని భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. మొర్తజా సారథ్యంలో బరిలో దిగుతున్న బంగ్లా జట్టులో తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్యా సర్కార్, ముష్ఫికర్ రహీమ్‌లతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది.
ముస్తాఫిజర్ రెహ్మన్, రుబెల్ హుసేన్‌లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ షకీబ్ అల్ హసన్, మొర్తజా లాంటి ఆల్‌రౌండర్లు బంగ్లా జట్టు సొంతం.
ఇవీ చూడండి.. 'టీమిండియా పక్కాగా సెమీస్ చేరుకుంటుంది'